Pink Power Run: బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకే పింక్‌ పవర్ రన్ 2.0

Pink Power Run: బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకే పింక్‌ పవర్ రన్ 2.0


Hyderabad Pink Power Run: నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన పింక్ పవర్ 2.0ను మేఘా ఇంజినీరింగ్‌ ఇండిస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఫౌండేషన్‌తో కలిసి సుధారెడ్డి ఫౌండేషన్‌ ఫౌండర్‌, చైర్‌పర్సన్‌ మేఘా సుధారెడ్డి నిర్వహించారు. ఈరన్‌లో 25వేలమంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన 10k, 5K, 3K రన్‌ విజేతలకు బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో MEIL MD మేఘా కృష్ణారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ హరి చందన, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్‌ రంజన్, మిస్‌ వరల్డ్‌ ఓపల్‌ సుచాతా, నటుడు బ్రహ్మానందం, టెన్నిస్ స్టార్ లియాండర్‌ పేస్‌ సహా పలువురు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పాల్గొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్‌ తీవ్రత ఎక్కువగా ఉందంటున్నారు వైద్యులు. ప్రతి 28 మందిలో ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. దేశంలోని మహిళల్లో కొత్తగా నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో 13.8 శాతం బ్రెస్ట్‌ క్యాన్సర్ కేసులే. దేశంలో నానాటికీ బ్రెస్ట్ క్యాన్సర్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో హైదరాబాద్‌ నగరం మొదటి స్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నగరంలో ప్రతి లక్ష మందిలో 54 మంది బ్రెస్ట్ క్యాన్సర్‌ బారిన పడుతున్నట్టు ఎన్‌సీఆర్పీ, ఐసీఎంఆర్‌ సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: రూ. లక్షా 15 వేలు దాటేసిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

స్మార్ట్ యుగంలో సైతం బ్రెస్ట్ క్యాన్సర్ ఆధునిక మహిళలను అంతులేని భయానికి గురిచేస్తోంది. సాధారణంగా బ్రెస్ట్‌లో కన్పించే గడ్డలన్నీ క్యాన్సర్ కాదంటున్నారు వైద్యులు. మిడిల్ ఏజ్ దాటాక బ్రెస్ట్‌లో వచ్చే మార్పులను గమనించాలని సూచిస్తున్నారు. ఏటా మామోగ్రామ్ పరీక్షతో క్యాన్సర్ లక్షణాలను ముందే గుర్తించే వీలుందంటున్నారు.40 ఏళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా తరచుగా ఈ పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ ఎంత బిజీగా ఉన్నా.. ప్రతి రోజు ఆ పని చేయనిదే నిద్రపోరట..!

బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే చికిత్స తీసుకోవడం తేలికే అంటున్నారు వైద్యులు. బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు హైదరాబాద్‌లో అడ్వాన్స్‌డ్ ఫెసిలిటీస్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా మేఘా సుధారెడ్డి మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రభుత్వాలు సీరియస్‌గా దృష్టి సారించాలన్నారు. గత ఏడాది నిర్వహించిన పింక్ రన్‌ విజయవంతంకావడంతో ఈసారి అదే స్ఫూర్తితో నిర్వహించామని చెప్పారు సుధారెడ్డి.

Pink Power Run

ఈ ఈవెంట్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు MEIL MD మేఘా కృష్ణారెడ్డి. జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం క్యాన్సర్‌కు కారణమవుతున్నదంటున్నారు. దాదాపు అన్ని ఆహార పదార్థాల కారణంగా హార్మోన్ల శాతం పెరుగుతోందంటున్నారు. ప్రాథమిక దశలో వ్యాధిని గుర్తిస్తే చికిత్సద్వారా నయంచేయవచ్చని చెప్పారు.

బ్రెస్ట్ క్యాన్సర్‌పై తమ పోరు కొనసాగిస్తామంటున్నారు నిర్వాహకులు. మహిళలు రెగ్యులర్‌గా మెడికల్ చెకప్‌ చేయించుకుంటే దీన్ని మొదట్లోనే గుర్తించి చికిత్సతో నివారించవచ్చని చెబుతున్నారు. వచ్చే ఏడాది కూడా పింక్‌ పవర్‌ రన్‌ మూడో ఎడిషన్‌ ఇంకా బాగా నిర్వహిస్తామంటున్నారు నిర్వాహకులు. ఆనందం పంచే హ్యాపీ వరల్డ్‌ను క్రియేట్ చేయటమే తమ లక్ష్యమని చెబుతున్నారు నిర్వాహకులు.

ఇది కూడా చదవండి: TVS: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన టీవీఎస్‌ బైక్‌, స్కూటర్ల ధరలు

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *