బిగ్ బాస్ సీజన్ 9 మూడో వారంలో ప్రియా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. నిన్న ఆదివారం కావడంతో నాగార్జున సందడి చేశారు. దసరా స్పెషల్ ఎపిసోడ్ జరిగింది నిన్న.. కింగ్ నాగార్జున హౌస్ మేట్స్ తో ఆటలు ఆడించి ఖుషీ చేశారు. అలాగే పలువురు సెలబ్రెటీలు కూడా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. అలాగే నిన్న ఎలిమినేషన్ కూడా జరిగింది. తెలుసు కదా మూవీ టీమ్ బిగ్ బాస్‌కు హాజరయ్యారు. సిద్ధార్థ్ జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష స్టేజ్ మీదకి వచ్చారు. ఈ సినిమా ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కాబట్టి .. హౌస్ లో ట్రై యాంగిల్ లవ్ స్టోరీ గురించి చెప్పు అని దివ్యను అడిగారు నాగ్. అడగ్గానే దివ్య పవన్, కళ్యాణ్, రీతూ చౌదరిని లేపి ముగ్గురి గురించి చెప్పింది.
రీతూ-కళ్యాణ్ ఫస్ట్ వీక్ చాలా క్లోజ్ అయిపోయారు.. ఇద్దరి మధ్య ఎదో బాండ్ ఉందనుకున్నాం..కానీ ఆతర్వాత పవన్ వచ్చాడు. రీతూ పవన్ క్లోజ్ అయ్యే గ్యాప్‌లో కళ్యాణ్ తనూజకి దగ్గరయ్యాడు. ఆమెతో క్లోజ్ అవుదామనుకున్నాడు.. కానీ తనూజ అంత స్కోప్ ఇవ్వలేదు. దాంతో కళ్యాణ్ మళ్లీ రీతూ దగ్గరికి వచ్చాడు. వీళ్లు ముగ్గురూ ఇలా ట్రయాంగిల్లా మిగిలిపోయారు అంటూ చెప్పుకొచ్చింది. దాంతో ఈ ట్రయాంగిల్ అసలు ఉందా లేదా అని వాళ్లకే తెలియాలి.. మా ఆడియన్స్‌కి తెలియాలి.. అంతా ఊహించుకుంటున్నారు అంతే అంటూ నాగ్ అన్నారు.
ఆతర్వాత ఆస్క్ బీబీ అనే కొత్తది మొదలుపెట్టారు నాగార్జున. హౌస్ లో ఉన్నవారి అభిమానుల నుంచి కొన్ని ప్రశ్నలు నాగ్ అడిగారు. హౌస్ మేట్స్ చెప్పిన సమాధానం జెన్యూనా లేక ఫేకా అనేది బిగ్ బాస్ షోకి వచ్చిన ఆడియన్స్ ను అడిగి తెలుసుకున్నారు. ముందుగా డీమాన్‌కి వచ్చిన ప్రశ్న నాగ్ అడిగారు. రీతూ మిమ్మల్ని కంటెంట్ కోసం యూజ్ చేసుకుంటుందని శ్రీజ చెప్పింది.. అప్పుడు వ్యతిరేకించకుండా నేను కూడా అందుకే మాట్లాడుతున్నా అని ఎందుకు అన్నారు.. అంటే మీరు కూడా కంటెంట్ కోసం ఏం చేయడానికైనా రెడీనా.. రీతూతో మీ రిలేషన్షిప్ అసలు నిజమేనా.. లేక కంటెంట్ కోసం చేస్తున్నారా.? అనే ప్రశ్నకు డిమాన్ సమాధానం చెప్పాడు. “ఫస్ట్ విషయం ఏంటంటే నేను కూడా తనతో దాని కోసమే మాట్లాడుతున్నా.. అన్న మాట నేను వాడలేదు సార్.. ఇక నేను బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటున్నా అన్నట్లుగా ఎప్పుడూ లేను.. నాతో ఎవరైనా ప్రేమగా, మంచిగా మాట్లాడితే నేను రిటర్న్ అలానే ఉంటున్నా సార్.. ఫేక్‌గా అయితే అసలు లేను.. ఆ ఎఫెక్షన్, బాండ్ అయితే ఉంది.. ఫేక్‌గా వచ్చింది అయితే కాదు.. అని డిమాన్ పవన్ చెప్పుకొచ్చాడు.. ఆడియన్స్ మాత్రం కన్విన్స్ కాలేదు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.