Gold Price Today: పండగల సీజన్‌లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. గత రెండు రోజుల్లో తులంపై సుమారు రూ.1500కుపైగా పెరిగిన బంగారం ధర.. తాజాగా పది రూపాయలు మాత్రమే తగ్గింది. ఈ తగ్గింపు పెద్దగా ఊరటనిచ్చేది కాదు. సెప్టెంబర్ 29వ తేదీన తులం ధర రూ.1,15,470 వద్ద ఉంది.
ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఎంత బిజీగా ఉన్నా.. ప్రతి రోజు ఆ పని చేయనిదే నిద్రపోరట..!
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
- ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,620 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,05,990 ఉంది.
- ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,05,840 ఉంది.
- హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,05,840 ఉంది.
- విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,05,840 ఉంది.
- చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,16,070 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,06,390 ఉంది.
- బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,05,840 ఉంది.
- ఇక వెండి ధర విషయానికొస్తే ఇది భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. రూ.1లక్షా 49,000, హైదరాబాద్, కేరళ, చెన్నై రాష్ట్రాల్లో అయితే కిలో వెండి ధర రూ.1,58,900 వద్ద కొనసాగుతోంది. గతంలో పెద్దగా పెరిగేది కాదు. కానీ ఈ మధ్య కాలం నుంచి వెండి ధర పరుగులు పెడుతోంది.
ఇవి కూడా చదవండి
భారతదేశంలో బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు?
భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు, డాలర్-రూపాయి మారకం రేటు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే బంగారం ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు గురవుతాయి. భారతీయ సంస్కృతిలో, బంగారాన్ని ఒక ఆభరణాల వస్తువుగా మాత్రమే కాకుండా ముఖ్యమైన పెట్టుబడి, పొదుపు సాధనంగా కూడా పరిగణిస్తారు. వివాహాలు, పండుగల సమయంలో దీనికి అధిక డిమాండ్ ఉంటుంది.
ఇది కూడా చదవండి: Bank Holidays: నేటి నుండి వరుసగా 10 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకో తెలుసా..?
ఇది కూడా చదవండి: School Holidays: అక్కడ అక్టోబర్ 6 వరకు పాఠశాలలకు సెలవులు!
ఇది కూడా చదవండి: TVS: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన టీవీఎస్ బైక్, స్కూటర్ల ధరలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి