గ్రామాల్లో, సర్కస్‌లలో చాలా మంది పాములు పట్టేవారు. పాములను పట్టుకొని వచ్చి బూరతో నాగస్వరం ఊది వాటిని నృత్యం చేసేలా చేస్తుంటారు. ఆ శబ్ధానికి అవి నృత్యం కూడా చేస్తుంటాయి. ఇది చాలా మంది చూసే ఉంటారు. కానీ దీని వెనుక ఉన్న నిజం కొంత భిన్నంగా ఉంటుంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
పాముటు పట్టే వ్యక్తి నాగస్వరం ఊదుతుండగా ఆ శబ్ధానికి తగ్గట్టు పాములు కదులుతుండడం మీరు చూసి ఉండవచ్చు. కానీ పాములు నిజంగా నాగస్వరానికి తగ్గట్టుగా నృత్యం చేస్తాయా? అంటే కాదనే అంటున్నారు నిపుణులు. పాములు అసలు నాగస్వరానికి డ్యాన్స్ చేయలేవని చెబుతున్నారు.
ఎందుకంటే పాములు ఏ శబ్ధాన్ని వనలేవట. అసలు పాములకు చెవులు, కర్ణభేరే ఉండదని చెబుతున్నారు. ఇది విన్నాక మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ ఇదే నిజమని నిపుణు చెబుతున్నారు.
అయితే పాము నాగస్వరానికి అనుగుణంగా నాట్యం ఎలా చేస్తుందంటే.. నాగస్వరం ఊదే వ్యక్తి పాముకు ముందే సిగ్నల్స్ ఇస్తాడట. నాగస్వరం ఊదే ముందు అతను పాము బుట్టమీద కొట్టి దాన్ని లేపుతాడట. దీంతో పాము భయపడిపోయి లేచి పడగ విప్పుతుందంట
సరిగ్గా పాము పడగవిప్పినప్పుడు అతను బూరను దాని ముందుకు తెచ్చి ఊదడం స్టార్ట్ చేసి అలూ ఇటూ కదులుతాడు. ఆ సమయంలో ఆ పాము బూరను కాటువేసేందుకు పడగవిప్పి దానికి చుట్టూ తిరుగుతుందట. దీన్ని చూసి అందరూ పాము నిజంగానే నాగస్వారానికి నృత్యం చేస్తుందని అనుకుంటారు.