India vs Pakistan Match Result: ఆసియా కప్‌ను భారత్ గెలుచుకుంది. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన టీం ఇండియా. ఈ టోర్నమెంట్‌లో ఆ జట్టుకు ఇది తొమ్మిదవ టైటిల్ విజయం.
ఆదివారం, భారత్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని 20వ ఓవర్ నాలుగో బంతికి చేరుకుంది. రింకు సింగ్ ఫోర్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. తిలక్ వర్మ 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
13వ ఓవర్లో సంజు శాంసన్ 24 పరుగులు చేసి అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో అబ్రార్ తిలక్, శాంసన్‌ల యాభై పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. పవర్ ప్లేలో శుభ్మాన్ గిల్ 12 పరుగులకు, సూర్యకుమార్ యాదవ్ 1 పరుగులకు, అభిషేక్ శర్మ 5 పరుగులకు ఔట్ అయ్యారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత్. పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ తరఫున సాహిబ్జాదా ఫర్హాన్ 57 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(సి), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(w), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..