అయితే.. యుద్ధ ప్రాతిపదికన ఆర్టీసీ అధికారులు తీసుకున్న చర్యలతో.. మొత్తానికి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ సేవలను పునరుద్ధరించగలిగారు. ఎంజీబీఎస్ లోపలికి బస్సులు వెళ్లే అవకాశం లేకపోవటంతో.. అక్కడి నుంచి బయలుదేరే బస్సులను నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి మళ్లించారు. ఇక పురానాపూల్ శివాలయంలో వరద నీటిలో చిక్కుకుపోయిన నలుగురు ఆలయ సిబ్బందిని హైడ్రా బృందాలు కాపాడాయి. శివాలయం పైనే పూజారి కుటుంబం ఉండిపోగా, రాత్రికి వారికి భోజనాలు అందించారు. ఉదయం పూజారి ఫ్యామిలీని సేఫ్‌గా అధికారులు కాపాడారు..ఇక ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై కూడా వరద బీభత్సం కనిపించింది. ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో నార్సింగి – మంచిరేవుల మధ్య సర్వీసు రోడ్డుపై వరద పారింది. శుక్రవారం రాత్రి 8గంటల నుంచి తెల్లారే వరకు ట్రాఫిక్ రద్దీ కొనసాగింది. వాహనదారులకు నరకం కనపడింది. చాదర్‌ఘాట్ వంతెన వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిన్న బ్రిడ్జి మూసివేయడంతో, పెద్ద బ్రిడ్జి పైనుంచి వాహనాలు రాకపోకలు కొనసాగించాయి. అంబర్‌పేట్ – దిల్‌సుఖ్‌నగర్ రహదారి పూర్తిగా మూసివేశారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్ విభాగాల అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 1500 మందికి పైగా ప్రజలను అధికారులు తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay: ఏ క్షణమైనా విజయ్ అరెస్ట్ ??
పంక్చరు షాపు నడిపే వ్యక్తి కూతురు.. ఇప్పుడు డీఎస్పీ
రైతుల పాలిట శాపంగా మారిన నత్తలు
నమ్మించారు.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్పించారు..రూ.64 లక్షలు గాయబ్
కుంభమేళా మోనాలిసా ఇలా మారిపోయిందేంటి ??