ఎంత కష్టమైనా వారు కూతురు చదువును మాత్రం ఆపలేదు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన మౌనిక కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించి తల్లిదండ్రుల జీవితాల్లో ఆనందాన్ని నింపింది. 2020లో డిగ్రీ పూర్తి చేసిన మౌనిక.. ఆ తర్వాత పూర్తిగా ఉద్యోగ సాధనపై ఫోకస్ పెట్టింది. కోచింగ్ సెంటర్లకు భారీ ఫీజులు కట్టే పరిస్థితి లేకపోవడంతో.. ఇంట్లోనే తన ప్రిపరేషన్ కొనసాగించింది. గ్రూప్-1 పరీక్షల కోసం రోజుకు 12 గంటలకుపైగా క్రమశిక్షణతో చదివింది. క్రమం తప్పకుండా టెస్ట్ పేపర్లు రాసి.. తన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగింది. ఎన్ని కష్టాలు వచ్చినా, లక్ష్యాన్ని వదల్లేదు. తన కృషి, పట్టుదల ఫలించింది. తాజాగా విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో మౌనిక 315వ ర్యాంక్ సాధించింది. ఈ ర్యాంక్ ద్వారా ఆమె డీఎస్పీగా ఎంపికైంది. తల్లిదండ్రులు ఒకప్పుడు చెమటోడ్చి నడిపిన పంక్చర్ షాపు ముందు, ఈ రోజు డీఎస్పీగా నిలబడ్డ కూతురిని చూసి వారి కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. మౌనిక గెలుపు కేవలం వ్యక్తిగత విజయమే కాదు.. అనేక పేద, మధ్యతరగతి యువతకు స్ఫూర్తి. శ్రమను ఆయుధంగా మార్చుకుంటే విజయం నీ సొంతం అవుతుంది అని తన జీవితం ద్వారా నిరూపించింది మౌనిక. గ్రామస్తులంతా ఆమెను అభినందించారు. గొప్ప కూతుర్ని కన్నారు అంటుంటే మౌనిక తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైతుల పాలిట శాపంగా మారిన నత్తలు
నమ్మించారు.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్పించారు..రూ.64 లక్షలు గాయబ్
కుంభమేళా మోనాలిసా ఇలా మారిపోయిందేంటి ??
అప్పు చెల్లించకుండా చనిపోయిన స్నేహితుడు.. కోపంతో శ్మశానంలోకి వచ్చి మరీ
పీఎఫ్ సొమ్ము విత్‌డ్రాపై ఈపీఎఫ్‌వో హెచ్చరిక