
టీవీ9లో ప్రసారమైన “క్రాస్ ఫైర్” కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు లిక్కర్ ఎక్సైజ్ కేసుతో పాటు స్కిల్ స్కామ్ కేసులో కూడా నిందితుడని ఆయన చెప్పారు. ఎక్సైజ్ కేసులో ప్రభుత్వం పొందుతున్న రాబడిని క్యాబినెట్ తీర్మానం లేకుండా ఉద్దేశపూర్వకంగా ప్రైవేటు వ్యక్తులకు చేరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తపరుడు అని, స్కిల్ స్కామ్ కేసులో జైల్లో ఉండగానే లిక్కర్ కేసులో బెయిల్ వచ్చేసిందని, అందుకే చంద్రబాబు లిక్కర్ స్కామ్లో నిందితుడని ప్రపంచానికి తెలియడం లేదని అన్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు కొల్లు రవీంద్ర కూడా లిక్కర్ స్కామ్లో ముద్దాయిలని, బెయిల్పై బయట ఉన్నారని పెర్ని నాని స్పష్టం చేశారు.