నమ్మించారు.. వాట్సాప్‌ గ్రూప్‌లో చేర్పించారు..రూ.64 లక్షలు గాయబ్‌

నమ్మించారు.. వాట్సాప్‌ గ్రూప్‌లో చేర్పించారు..రూ.64 లక్షలు గాయబ్‌


కళ్లకు కనిపించని సైబర్‌ నేరగాళ్లు ఎక్కడో కూర్చుని ఇక్కడి మన బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. కొత్త తరహా మోసాలకు తెరతీస్తూ కోట్లు దండుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యాపారి వాట్సప్‌ గ్రూప్‌లో చేరి రూ.64 లక్షలు పోగొట్టుకున్నాడు. నకిలీ పెట్టుబడుల పేరుతో ఆ వ్యాపారిని నిండా ముంచారు. న్యూ నల్లకుంటకు చెందిన ఒక వ్యాపారికి గత నెలలో ఒక మహిళ వాట్సప్‌లో పరిచయమైంది. ఆ తర్వాత ఆమె సహాయకుడిగా మరొకరు వ్యాపారికి టచ్‌లోకి వచ్చారు. రెండు రోజుల తర్వాత సుమారు 200 మంది సభ్యులు ఉన్న ఒక వాట్సప్‌ గ్రూప్‌లో చేర్చారు. ఆ గ్రూప్‌లో ఉన్న సభ్యులు తాము ‘ఇనిస్టిట్యూషనల్‌ ఎకౌంట్‌’ ద్వారా పెట్టుబడి పెట్టి భారీ లాభాలు పొందుతున్నట్టు చాటింగ్‌ చేయడం గమనించారు. వారి మాటలు నమ్మిన వ్యాపారి.. ముందుగా రూ. 50 వేలు డిపాజిట్‌ చేశాడు. మరుసటి రోజు రూ. 1,265 లాభం వచ్చినట్టు చూపించి.. ఆ డబ్బును అతడి ఖాతాలో జమ చేశారు. ఇది నిజమని నమ్మిన ఆయన.. పలు దఫాలుగాగా రూ. 24 లక్షలు చెల్లించారు. దీనికి ప్రతిగా 3,81,300 షేర్లు కొనుగోలు చేసినట్టు సమాచారం అందుకున్నారు. ఈ విధంగా మొత్తం రూ. 64 లక్షలు నకిలీ షేర్లలో పెట్టుబడి పెట్టారు. రోజులు గడుస్తున్నా అసలు కానీ, లాభం కానీ వెనక్కి తీసుకునే అవకాశం లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ తరహా మోసాల్లో సైబర్‌ మాయగాళ్లు ఎక్కువగా నకిలీ కంపెనీల పేర్లు ఉపయోగిస్తుంటారు, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాట్సప్‌, టెలిగ్రామ్ ద్వారా తెలియని వ్యక్తులు పంపే లింక్‌లను క్లిక్ చేయవద్దన్నారు. అపరిచిత గ్రూప్‌ల నుంచి వెంటనే బయటకు వచ్చేయాలని సూచిస్తున్నారు. బ్యాంక్‌ వివరాలు, OTPలు ఎట్టిపరిస్థితిలోనూ అపరిచితులకు అందించవద్దన్నారు. మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోర్టల్ 1930కి లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో కానీ, ఫిర్యాదు చేయాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుంభమేళా మోనాలిసా ఇలా మారిపోయిందేంటి ??

అప్పు చెల్లించకుండా చనిపోయిన స్నేహితుడు.. కోపంతో శ్మశానంలోకి వచ్చి మరీ

పీఎఫ్‌ సొమ్ము విత్‌డ్రాపై ఈపీఎఫ్‌వో హెచ్చరిక

రూ.4 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారికి విశేష అలంకరణ

Cheeramenu Fish: పులస వెళ్లింది.. చీరమేను వచ్చింది..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *