దీంతో సాధారణ పూసలు అమ్ముకునే మోనాలిసా.. మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరవాత మోనాలిసా సొంత ఛానల్ పెట్టి యూట్యూబ్ వీడియోలు చేయడం, సినిమా ఆఫర్లు రావడం కూడా జరిగింది. ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఆమెతో వీడియో సాంగ్ సైతం తీసారు. మధ్యలో మోనాలిసా పెద్దగా వార్తల్లో కనిపించలేదు. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో మోనాలిసా పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తుంది. మోనాలీసా కట్టు బొట్టు మార్చేసినట్టు తెలుస్తోంది. ఓ మోడల్ లేదా హీరోయిన్ మాదిరిగా ఓ పాటకు స్టెప్పులు వేస్తున్నట్టు వీడియోలో దర్శనమిచ్చింది. ఈ వీడియో నిజమైనదే అని చాలా మంది భావిస్తున్నారు. నిజానికి ఏఐతో క్రియేట్ చేసిన వీడియో అని తెలుస్తోంది. ప్రస్తుతం టెక్నాలజీ వాడకం పెరగడంతో చాలా మంది హీరోయిన్ల మార్ఫింగ్ వీడియోలు చేసినట్టే మోనాలిసా వీడియోను కూడా మార్ఫింగ్ చేశారని తెలుస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాకవుతూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పు చెల్లించకుండా చనిపోయిన స్నేహితుడు.. కోపంతో శ్మశానంలోకి వచ్చి మరీ
పీఎఫ్ సొమ్ము విత్‌డ్రాపై ఈపీఎఫ్‌వో హెచ్చరిక
రూ.4 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారికి విశేష అలంకరణ
Cheeramenu Fish: పులస వెళ్లింది.. చీరమేను వచ్చింది..
కరివేపాకు కోద్దామని పెరట్లోకి వెళ్లింది..కళ్లు మూసి తెరిచేంతలో ఆమె