Perni Nani: ‘నా గుండెకాయ లాంటి మనిషిని చంపేశారు’.. పేర్ని నాని భావోద్వేగం

Perni Nani: ‘నా గుండెకాయ లాంటి మనిషిని చంపేశారు’.. పేర్ని నాని భావోద్వేగం


టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “నా గుండెకాయ లాంటి మనిషిని చంపేశారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి తరతరాలుగా ఎంతో విధేయంగా ఉన్న ఓ వ్యక్తిని కోల్పోయిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. మచ్చకార కుటుంబంలో పుట్టినా, విమర్శలు ఎదుర్కొన్నా, తమతోనే నిలబడిన ఆ మంచి మనిషి హత్య తనను ఎంతగానో కలచివేసిందని ఆయన తెలిపారు. తెలిసే ఏ రాజకీయ శత్రువునైనా తప్పుడు కేసులో ఇరికించి జైల్లో పెడితే జరిగే పర్యవసానాలు తనకు తెలుసని పేర్కొన్నారు.

చంద్రబాబుపై మీకు సాప్ట్ కార్నర్ ఉందా అని ప్రశ్నించగా…  ఒకవేళ తనకు = నిజంగానే అవసరం ఏర్పడితే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నమస్కారం పెట్టి ఇంట్లో పడుకుంటానని, కానీ రాజకీయాల్లో వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదని, ఒక వేశ్య కన్నా ఘోరంగా బతకాల్సిన అవసరం లేదని పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *