తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగవైభంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మొత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం శ్రీవేంకటేశ్వర స్వామివారు గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభమైన ఈ గరుడ వాహనసేవను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. శ్రీవారి గరుడవాహన సేవలను భక్తులందరూ తిలకించేందుకు మాడవీధుల్లో భారీగా స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఆదివారం దాదాపు 2లక్షలకు పైగా భక్తులు శ్రీవానిరి గరుడసేవలను చూసేందుకు తరలివచ్చారు.
ఏడాదిలో ఒక్కసారి మాత్రమే, అది గరుడ సేవరోజు మాత్రమే శ్రీవారి మూలవిరాట్టుకు అలంకరించే లక్ష్మీహారం, మకరకంఠి ఆభరణాలతో శ్రీమలయప్పస్వామికి అలంకరిస్తారు. ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. తన తల్లిని బానిసత్వం నుంచి విడిపించేందుకు వైనతేయుడు దేవలత నుంచి అమృతాన్ని తీసుకువెళ్తాడు. తన తల్లిపై తనకు ఉన్న ప్రేమకు మెచ్చి గరుత్మంతుడిని శ్రీమహావిష్ణువు తన వాహనంగా చేసుకున్నాడు. అందుకనే స్వామివారి గరుడవాహన సేవను తిలకించేందుకు ప్రతిఏటా వేలాదిమంది భక్తులు తరలివస్తారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.