దేశ రాజకీయ పరిణామాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను కలిశారు. ఇటీవలే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రాధాకృష్ణన్‌ను ప్రధానమంత్రి… ఆయన నివాసం, వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్ వద్ద కలసి శుభాకాంక్షలు తెలిపారు.
ఉపరాష్ట్రపతి కార్యాలయం ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం X ద్వారా వెల్లడించింది. “గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నేడు గౌరవనీయ ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ గారిని వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు” అని పోస్ట్‌లో పేర్కొంది. ప్రధాని మోదీ కూడా ఈ భేటీ గురించి ట్వీట్ చేశారు.
Called on Vice President Thiru CP Radhakrishnan Ji and had an insightful discussion with him on a wide range of subjects.@VPIndia @CPR_VP pic.twitter.com/D2cvEn6q6e
— Narendra Modi (@narendramodi) September 28, 2025
ఈ భేటీలో దేశ రాజకీయ పరిస్థితులు, ముఖ్యమైన జాతీయ అంశాలపై ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా పార్లమెంట్‌లో శాసన కార్యక్రమాలు వేగంగా జరుగుతున్న తరుణంలో, ఈ సమావేశం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
రాధాకృష్ణన్ ఇటీవలే ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించగా, దేశంలోని రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన ఆయనకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంలో ప్రధాని మోదీ స్వయంగా వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.