దసరా కానుకగా అడియన్స్ ముందుకు రాబోతున్న సినిమాల్లో కాంతార చాప్టర్ 1 ఒకటి. కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో సూపర్ హిట్ అయిన కాంతార చిత్రానికి ప్రీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే ఈ వేడుకకు సింపుల్ గా వచ్చిచన తారక్.. ఎక్కువ సేపు నిలబడలేకపోతున్నానని అన్నారు. కుడి చేసి భుజం దిగువన చేయి పెడుతూ నొప్పితో ఫీలవుతున్నట్లు కనిపించారు. ఈ వేడుకలో తారక్ మాట్లాడుతూ.. తాను చిన్నప్పుడు విన్న కథలతో సినిమా రూపొందుతుందని అనుకోలేదని అన్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “దాదాపు నాకు మూడేళ్ల వయసున్నప్పుడు.. అమ్మమ్మ కుందాపుర సమీపంలోనే మన ఊరు అని చెప్పేది. అందుకు సంబంధించిన కథలు చెప్పేది. అవన్నీ నాకు నచ్చేవి. ఇలా నిజంగానే జరుగుతుందా ? అని నాకు చాలా సందేహాలొచ్చేవి. గుళిక, పంజుర్లి గురించి తెలుసుకోవాలనిపించేది. నేను చిన్నప్పుడు విన్న ఆ కథలతోనే ఓ దర్శకుడు సినిమా తెరకెక్కిస్తాడని అనుకోలేదు. నా సోదరుడు రిషబ్ శెట్టి దాన్ని సాధ్యం చేశాడు. నేను బాల్యంలో విన్న కథలు ఇప్పుడు తెరపై చూసి ఆశ్చర్యపోయాను. దాని గురించి మాటల్లో చెప్పలేను. కథ తెలిసి నేనే ఇలా అయిపోతే.. కొత్త తెలుసుకున్నవారు ఏమయ్యారో అదే ఈ కాంతార ఫలితం. ఈ దసరాకు అందరూ కాంతార చాప్టర్ 1 సినిమా చూసి ఆశీర్వదించండి. ” అంటూ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
రిషబ్.. అరుదైన దర్శకుడు.. అలాగే నటుడు. ఆయనలోని డైరెక్టర్ ను యాక్టర్ డామినేట్ చేయడం కాదు.. 24 విభాగాలను డామినేట్ చేస్తారు. కాంతార చిత్రాన్ని ఈ స్థాయిలో తెరకెక్కించడం మరెవరి వల్ల సాధ్యమయ్యేది కాదు. మా అమ్మను ఉడుపి కృష్ణుడి ఆలయానికి తీసుకెళ్లాలనేది ఎప్పటినుంచో నా కోరిక. రిషబ్ వల్ల ఆ దర్శన భాగ్యం దక్కింది. తమ పనులను పక్కనపెట్టి ఆయన కుటుంబం మా కోసం వచ్చింది. నన్ను కుటుంబసభ్యుడిగా చూసుకున్నారు. అప్పుడే కాంతార చాప్టర్ 1 కోసం ఎంతగా కష్టపడుతున్నారో అర్థమైంది అని అన్నారు. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ ఓ షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎక్కువ సేపు నిలబడలేకపోతున్నానని.. అలాగే గట్టిగా మాట్లాడలేకపోతున్నానని అన్నారు.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..