పసుపు అనేది స్వయంగా యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా దీనిలో అనేక పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల దీనిని పాలు లేదా నీటిలో దేనిలో కలిపి తాగిన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ రెండు పదార్థాలతో పసుపును కలలి తాగడం వల్ల శరీరంపై భిన్నమైన ప్రభావాలు ఉంటాయి. ఉదాహరణకు, మనం బరువు తగ్గాలనుకుంటే లేదా శరీరాన్ని నిర్విషీకరణ చేయాలనుకుంటే, పసుపును నీటితో తీసుకోవాలి. మీరు పాలతో పసుపు తీసుకున్నప్పుడు, అది వెంటనే శరీరంలోకి శోషించబడుతుంది ఎందుకంటే దీనిని పాలతో కలిపినప్పుడు, ఇది కాల్షియంను అందిస్తుంది. ఇది మన ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు దీన్ని మీ సాధారణ ఆహారంలో చేర్చుకోవాలనుకుంటే, పాలతో తీసుకోండి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అలాగే జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
పసుపు వల్ల కలిగే ప్రయోజాలు
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లోని సమాచారం ప్రకారం.. పసుపు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పసుపులో కర్కుమిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది వృద్ధాప్యం, ఊబకాయంతో సంబంధం ఉన్న గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది. అలాగే ఇది మెదడు కణాల అభివృద్ధిని పెంచడానికి సహాయపడుతుంది. పసుపు వాపును కూడా నివారిస్తుంది. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. కర్కుమిన్ సప్లిమెంట్లు కీళ్ల వ్యాధి అయిన ఆర్థరైటిస్ ఉన్న రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.
పసుపు నీటిని ప్రయోజనాలు
శరీర డిటాక్స్ చేసుకోవడం లేదా బరువు తగ్గాలనుకునే వారికి పసుపు నీరు మంచి ఎంపిక. దీన్ని మీరు మీ ఆహారంలో చేర్చుకోవాలనుకుంటే, ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది. పచ్చి పసుపు ముక్కలను కోసి రాత్రంతా నీటిలో నానబెట్టడం లేదా పచ్చి పసుపును తురుము నీటిలో వేసి బాగా మరిగించి, గోరువెచ్చగా త్రాగడం మంచిది. మీరు రుబ్బిన పసుపును ఉపయోగించాలనుకుంటే, ఇంట్లో పసుపు ముద్దలను రుబ్బుకోవడం మంచిది.
పసుపు పాలు వల్ల కలిగే ప్రయోజనాలు
మీరు పసుపును పాలలో వేసుకొని తాగాలనుకుంటే.. పసుపును ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి లేదా పేరున్న బ్రాండ్‌ను కొనండి. ఎందుకంటే బయట చాలా రకాల పసుపులు కల్తీగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు. మీరు పసుపు పాలును తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మంచి నిద్రను పొందుతారు అలాగే ఎముకలు, కండరాల ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే పాలలో ఉండే కాల్షియం, బి12, విటమిన్ డితో పాటు పసుపు కూడా ప్రయోజనాలను అందిస్తుంది. బి12 శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచడానికి సహాయపడుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.