
ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఈ రెండు ప్రత్యర్థులు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి.
ఈ టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ తలపడటం ఇది మూడోసారి, గత రెండు మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది.
గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఆడటం లేదు. అతని స్థానంలో రింకు సింగ్ను ప్లేయింగ్ 11లో చేర్చారు. పాకిస్తాన్ ప్లేయింగ్ 11లో ఎటువంటి మార్పులు లేవు.
రెండు జట్ల ప్లేయింగ్-11
భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి మరియు జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, షాహీన్ షా ఆఫ్రిది, ఫహీమ్ అష్రఫ్ మరియు హారీస్ రవూఫ్.