బీట్రూట్ దుంపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. అయితే కొంతమంది ఈ దుంప రసం తాగకపోవడమే మంచిది. ఎందుకంటే వీరికి ప్రయోజనకరంగా ఉండటానికి బదులు మరింత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిజానికి, బీట్రూట్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజూ బీట్రూట్ రసం తాగితే అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో బీట్రూట్ రసం తాగడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇందులో ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.
కానీ దీని జ్యూస్ కొంత మందికి విషంలా పని చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏయే వ్యక్తులు బీట్రూట్ జ్యూస్ తాగకూడదంటే.. తక్కువ రక్తపోటు ఉన్నవారు బీట్రూట్ జ్యూస్ తాగకుండా ఉండాలి. బీట్రూట్లోని సమ్మేళనాలు రక్తపోటును మరింత తగ్గిస్తాయి.
వీరు పొరబాటున బీట్రూట్ జ్యూస్ తాగితే అకస్మాత్తుగా తల తిరగడం, తలనొప్పి రావడం వంటి లక్షణాలు సంభవిస్తాయి. అందుకే తక్కువ రక్తపోటుతో బాధపడేవారు ఎల్లప్పుడూ బీట్రూట్ జ్యూస్‌కి దూరంగా ఉండాలి.