Actress: నాని, పవన్ కళ్యాణ్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు సినిమాలు లేక.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే..

Actress: నాని, పవన్ కళ్యాణ్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు సినిమాలు లేక.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే..


చిన్నవయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది. సీరియల్స్, సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. తమిళంలో అనేక చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. తెలుగులోనూ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో అదరగొట్టింది. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ఇటీవలే జనాలను తెగ ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? పైన ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఆ చిన్నారి తెలుగులో క్రేజీ హీరోయిన్. తనకంటూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు.. మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి

న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత నిన్నుకోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా, వి, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించింది. ఈ సినిమాతో ఆమె పేరు మారుమోగింది. అయితే వరుస హిట్స్ అందుకున్నప్పటికీ ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. కొన్ని రోజులు సైలెంట్ అయిన ఈ బ్యూటీ శాకిని డాకిని వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో మరోసారి నటిగా ప్రశంసుల అందుకుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో నటించిన నివేదా.. ఇటీవలే 35 ఇది చిన్న కథ కాదు అనే చిత్రంతో మరోసారి ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. అయితే నటిగా మంచి మార్కులు కొట్టేసిన నివేదాకు అంతగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *