కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్న తాజా చిత్రం కాంతారా 2. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కాంతార’ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. దీంతో వెంటనే ఈ సూపర్ హిట్ సినిమాకు ప్రీక్వెల్‌ను ప్రకటించారు. దీనికి ‘కాంతారా: చాప్టర్ 1’ అని టైటిల్ పెట్టారు. ‘హోంబాలే ఫిల్మ్స్’ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందురు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కాంతార 2 ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కుందాపూర్‌లో జరుగుతోంది. ప్రస్తుతం రిషబ్ శెట్టి ఈ సినిమా పైనే దృష్టి సారించాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు.