రీసెంట్ ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్కులో ఐదుగురు పోటీ పడగా.. ఇమ్మాన్యుయేల్ గెలిచి మూడో కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత అందరూ నిద్రలో ఉండగా.. అర్దరాత్రి సైరన్ మోగించి కంటెస్టెంట్లను నిద్ర లేపాడు బిగ్‌బాస్. దీంతో అందరూ నిద్రలేచి గార్డెన్ ఏరియాకు వచ్చారు. నా చక్రవ్యూహం మొదటి అధ్యాయంలో దివ్య ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు అందులోని మరో అద్యాయానికి సమయం వచ్చిందంటూ షాకిచ్చాడు బిగ్ బాస్. హౌస్మేట్స్ అందరూ మీకు లభించిన ఫలాల్లోని బ్లూ, బ్లాక్ సీడ్స్ ఏం తీసుకొచ్చాయో చూశారని చెప్పిన బిగ్ బాస్… ఇప్పుడు రెడ్ సీడ్ పొందినవారు వంతన్నాడు. ఎప్పుడూ లేని విధంగా రెడ్ సీడ్ వచ్చినవారిలో ఒకరిని హౌస్ నుంచి బయటకు పంపే అధికారాన్ని ఇస్తున్నాని కంటెస్టెంట్స్‌కు షాకిచ్చాడు. దివ్య నేను పంపిన సభ్యురాలు.. ఫ్లోరా ఇమ్యూనిటీ గెలుచుకున్నారు. వీరిద్దరిని కాకుండా రెడ్ సీడ్ వచ్చినవారందరూ మాట్లాడుకుని.. ఒకరిని హౌస్ నుంచి బయటకు పంపేందుకు ఎంచుకోవాలని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో రెడ్ సీడ్ వచ్చిన భరణి, హరీష్, కళ్యాణ్, డీమాన్, రాము అందరూ సంజనను ఎలిమినేట్ చేసేందుకు ఎంచుకున్నారు. ఇదే విషయాన్ని హౌస్‌లోని అందరి ముందు చెప్పారు. దీంతో సంజన తనను అందరూ కార్నర్ చేస్తున్నారంటూ ఆరోపించింది. తాను ఇప్పటి వరకు 100 కాదు 500 పర్సంట్ ఇచ్చాను అంటూ ఎమోషనల్ అయింది. ఇక సంజన మిడ్ వీక్ ఎలిమినేషన్ కావడంతో ఇమ్మాన్యుయేల్ వెక్కి వెక్కి ఏడ్చాడు. అయితే అతన్నీ ఓదార్చిన సంజన.. బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్లింది. కట్ చేస్తే.. బిగ్ బాస్ మరో సారి తన గేమ్ ప్లే చేశాడు. సంజనను బయటికి పంపించకుండా… సీక్రెట్ రూమ్‌కి తీసుకెళ్లాడు. ఇక అక్కడికి వెళ్లిన సంజన.. వెళ్లీ వెళ్లగానే హెడ్ సెట్ పెట్టుకుని హౌస్‌మేట్స్ తన గురించి ఎవరు, ఏం మాట్లాడుకుంటున్నారంటూ వినడం మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఇమ్యాన్యుయేల్ ఏడడం చూసి.. మరో సారి ఎమోషనల్ అయింది. ఆమె తిరిగి వస్తుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అని భరణి.. ఇమ్మూతో చెప్పడం కూడా వినింది సంజన.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొడుకు సిరీస్ వల్ల.. షారుఖ్‌కు 2 కోట్ల కష్టం
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. అబార్షన్ !! అబద్ధం చెప్తే కుక్కచావు చస్తా …
బిగ్ బాస్ వైల్డ్ డెసీషన్‌కి బిత్తర పోయిన కటెంస్టెంట్స్
ఇక ఏ సినిమా టికెట్ ధరల పెంపు ఉండదా..?
సైయార స్టార్స్‌కు క్రేజీ ఆఫర్స్.. దశ తిరిగినట్లేనా