
రాత్రిళ్లు ఫోన్ చూడడం అనేది చాలా డేంజర్ అని సైకాలజిస్టులు చెప్తున్నారు. దీనివల్ల ఫిజికల్ హెల్త్ తో పాటు మెంటల్ హెల్త్ కూడా దెబ్బతింటుందట. ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలున్నాయంటే..
స్లీప్ డిస్టర్బెన్స్
పడుకునేముందు ఫోన్ స్క్రీన్ చూడడం ద్వారా దాని బ్లూ లైట్ ఎక్స్‌పోజర్ కంటి మీద ప్రభావం చూపుతుంది. ఫోన్ నుంచి వచ్చే లైట్ కంటి మీద పడినప్పుడు కళ్లు అసౌకర్యానికి గురవ్వడమే కాకుండా రాత్రి సహజంగా రిలీజయ్యే మెలటోనిన్ హర్మోన్ రిలీజ్ అవ్వదట. దాంతో సరిగా నిద్ర పట్టకపోవడమే కాకుండా స్లీప్ క్వాలిటీ దెబ్బ తింటుంది.
డ్రీమ్స్‌పై ఎఫెక్ట్
నిద్ర పోయేముందు ఫోన్ చూస్తూ ఏయే ఆలోచనలతో గడిపారో నిద్రలో కూడా అవే ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. ఇవి నెగెటివ్ డ్రీమ్స్, నైట్‌మేర్స్ లాంటి వాటికి దారితీసే అవకాశం ఉంటుందని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఈ ఎఫెక్ట్ మరుసటి రోజు పగలు కూడా ఉంటుంది. అంటే రాత్రిపూట ఏ రీల్స్ చూస్తూ పడుకున్నారో.. అవే ఆలోచనలు నిద్ర లేవగానే వస్తాయి. తద్వారా మీ రోజంతా మూడ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది.
డార్క్ సర్కిల్స్
నైట్ ఫోన్ ఎక్కువగా వాడే వాళ్లకు కళ్ల కింద డార్క్ సర్కిల్స్ రావడం పక్కా అంటున్నారు డాక్టర్లు. పడుకునేముందు ఫోన్ వాడడం వల్ల కళ్లు మరింత ఎక్కువ అలసిపోతాయి. కళ్లు పగటివేళ కంటే ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దాంతో కళ్లకు పూర్తిగా రెస్ట్ దొరకదు. ఇది కంటి కింద డార్క్ సర్కిల్స్‌కు, ఇతర కంటి సమస్యలకు దారి తీస్తుంది.
స్ట్రెస్, డిప్రెషన్
ఎంత ప్రశాంతంగా నిద్రపోయారు అన్న దాన్ని బట్టి మానసిక ఆరోగ్యం ఉంటుంది. గాఢ నిద్రపోతే రోజంతా ప్రశాతంగా యాక్టివ్‌గా ఉంటుంది. అలాకాకుండా మొబైల్ చూస్తూ రకరకాల ఆలోచనలతో నిద్రపోతే అది స్లీప్ క్యాలిటీని దెబ్బతీసి ఒత్తిడి, డిప్రెషన్ వంటివి కలుగజేస్తుంది.
ఇలా చేయొచ్చు
పగటిపూట ఎంత ఫోన్ వాడినా కనీసం రాత్రిళ్లు మొబైల్ వాడకాన్ని తగ్గిస్తే మెంటల్లీ హెల్దీగా ఉండొచ్చనేది నిపుణుల సలహా. రాత్రిపూట ఫోన్‌లో రీల్స్ వంటివి చూసే బదులు లైట్ మ్యూజిక్ వింటూ నిద్రపోతే స్లీప్ క్యాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. రాత్రిళ్లు మరింత గాఢంగా నిద్రపట్టాలంటే నిద్రపోయే ముందు స్నానం చెయొచ్చు, పుస్తకం చదవొచ్చు. అలాగే ఎర్లీగా డిన్నర్ పూర్తి చేస్తే మరింత క్వాలిటీ స్లీప్ పొందొచ్చు.