అమరావతి, సెప్టెంబర్ 28: రాష్ట్ర నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ మరో గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏకంగా ఒకేసారి 10 కొత్త నోటిఫికేషన్లను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ల కింద మొత్తం 47 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల్లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు 11, ఏఎంవీఐ 1, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 1 పోస్టులకు సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సైనిక్ సంక్షేమంలో సంక్షేమ ఆర్గనైజర్ పోస్టులు 10, జిల్లా సైనిక్ సంక్షేమ అధికారి పోస్టులు 7 ఉన్నాయి.
ఇక జూనియర్ అకౌంట్స్ అధికారి కేటగిరీ 2లో ఒక పోస్టు, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ-3లో 4 పోస్టులు, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4లో 6 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటికీ అక్టోబరు 9 నుంచి 29 వరకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. మత్స్యశాఖలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ 3 పోస్టులు, వార్డెన్ గ్రేడ్1లో 1 పోస్టు, రాయల్టీ ఇన్స్పెక్టర్ ఒక పోస్టు, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ 1 పోస్టుకు అక్టోబరు 8 నుంచి 28 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.
ఏపీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
అక్టోబర్ 3న LIC AAO రాత పరీక్ష.. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ లింక్ ఇదే
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టులకు సంబంధించి ఫేజ్ 1 రాత పరీక్ష మరో 5 రోజుల్లో జరగనుంది. ఈ క్రమంలో రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఆన్లైన్ రాత పరీక్ష అక్టోబర్ 3న జరగనుంది. కాగా ఈ నోటిఫికేషన్ కింద మొత్తం350 ఎల్ఐసీ ఏఏఓ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ద్వారా అధికారిక వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
LIC AAO రాత పరీక్ష అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.