Eyeglass: మీ లెన్స్‌లపై గీతలు ఉన్నాయా?.. ఈ సింపుల్‌ ట్రిక్స్‌తో క్షణాల్లో తొలగించండి

Eyeglass: మీ లెన్స్‌లపై గీతలు ఉన్నాయా?.. ఈ సింపుల్‌ ట్రిక్స్‌తో క్షణాల్లో తొలగించండి


కళ్లజోడు లెన్స్‌లపై పడే చిన్న గీతలు కొన్ని సార్లు మీ దృష్టిని అస్పష్టం చేస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు తరచుగా కొత్త అద్దాలు కొనాలంటే చాలా కష్టం. కాబట్టి మీరు కొత్త అద్దాలు కొనడానికి లేదా లేన్స్‌ మార్చుకోవడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి ముందు మేము చెప్పి కొన్ని చిట్కాల గురించి తెలుసుకోండి. ఈ సింపుట్‌ టిప్స్‌తో మీరు మీ ఇంట్లోనే మీ లెన్స్‌పై ఉన్న గీతలను ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు.

ఇంట్లో కళ్లజోడును శుభ్రం చేసుకునే చిట్కాలు

టూత్‌పేస్ట్: లెన్స్‌ క్లిన్ చేసేందుకు టూత్‌పేస్ట్ అనేది సులభమైన, అత్యంత ప్రజాదరణ పొందిన పరిష్కారాలలో ఒకటి. దీని కోసం మీరు శుభ్రమైన కాటన్ తీసుకొని దానికి కొద్దిగా టూత్‌పేస్ట్ యాడ్‌ చేసి గీతలు పడిన ప్రాంతాన్ని గుడ్రంగా సున్నితంగా రుద్దండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ ప్రెస్‌ చేయకండి. ఇలా చేస్తే ఇంకా ఎక్కువ గీతలు పడే అవకాశం ఉంది. దాదాపు 15 నుండి 20 సెకన్ల పాటు రుద్దిన తర్వాత, గ్లాసులను నీటితో శుభ్రం చేసి, పొడి మైక్రోఫైబర్ వస్త్రంతో తుడవండి. దీంతో లెన్స్‌పై ఉన్న మరకలు తొలిగిపోతాయి

బేకింగ్ సోడా పేస్ట్: మరకలను తొలగించేందుకు బేకింగ్‌ సొడా కూడా మంచి ఎంపిక.. మీరు మొదటగా ఒక చిన్న గిన్నెలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, కొన్ని చుక్కల నీటిని కలిపి మందపాటి పేస్ట్ తయారు చేయండి. ఈ పేస్ట్‌ను గీతలపై అప్లై చేసి పైన చెప్పినట్లుగా సున్నితంగా రుద్దండి. ఆ తర్వాత, గ్లాసులను శుభ్రమైన నీటితో శుభ్రం చేసి, పొడి గుడ్డతో తుడవండి.దీంతో లెన్స్‌పై ఉన్న మరకలు తొలిగిపోతాయి

కారు వ్యాక్స్ లేదా పెట్రోలియం జెల్లీ: కారు వ్యాక్స్ లేదా పెట్రోలియం జెల్లీ గీతలను పూర్తిగా తొలగించలేవు. కానీ అవి తాత్కాలికంగా వాటిని తొలగించడంలో సహాయపడతాయి. స్క్రాచ్‌పై కారు వ్యాక్స్ లేదా పెట్రోలియం జెల్లీని పలుచగా పూయండి. తర్వాత మృదువైన వస్త్రంతో దాన్ని క్లీన్ చేయండి. దీంతో లెన్స్‌పై ఉన్న మరకలు తాత్కాలికంగా తొలిగిపోతాయి

కొబ్బరి నూనె: మీ అద్దాలకు ప్లాస్టిక్ లెన్స్‌లు ఉంటే, కొబ్బరి నూనె మంచి ఎంపిక. స్క్రాచ్‌పై కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి, కాటన్ బాల్ ఉపయోగించి మెల్లగా రుద్దండి. ఇది స్క్రాచ్ తక్కువగా కనిపించడానికి, లెన్స్‌లను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *