ఎప్పుడైనా ఆధార్ కార్డు కావాల్సి వస్తే.. దానికోసం యూఐడీఏఐ వెబ్ సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇకపై ఆ అవసరం లేకుండా వాట్సాప్ నుంచే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు కోసం ప్రతిసారీ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. దీనికోసం ఒక ప్రత్యేకమైన ఛాట్ బాట్ ను వాట్సాప్ లో ఇంటిగ్రేట్ చేసింది. ఇదెలా పనిచేస్తుందంటే..
ప్రాసెస్ ఇదే..
వాట్సాప్ ఆధార్ సేవలు ఉపయోగించుకోవాలంటే.. ముందుగా ఆధార్‌ను మొబైల్ నెంబర్ త లింక్ చేసుకోవాలి. అలాగే డిజిలాకర్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇలా చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ లో మైగవ్(mygov) హెల్ప్‌డెస్క్ +91-9013151515 నంబర్ ను సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత..
- వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు హాయ్ అని గ్రీటింగ్ మెసేజ్ పంపాలి.
- చాట్ బాట్ నుంచి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ లో డిజిలాకర్ సేవలను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత మీ డిజిలాకర్ అకౌంట్ ను వెరిఫై చేసి మీ 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
- తర్వాత వెరిఫికేషన్ కోసం రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.
- ఇప్పుడు మీ డిజి లాకర్ లో ఉన్న డాక్యుమెంట్స్ లిస్ట్ కనిపిస్తుంది.
- ఇప్పుడు అందులో ఆధార్‌ను ఎంచుకుంటే కార్డు పీడీఎఫ్ రూపంలో వాట్సాప్‌లోకి వస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
- అయితే ఒకసారి ఒక పత్రాన్ని మాత్రమే పొందే వీలుంటుంది.
- ముందుగా డిజిలాకర్‌లో ఆధార్ లింక్ చేసి ఉంటేనే వాట్సాప్ లో కనిపిస్తుంది. లేకపోతే ముందు డిజీలాకర్ లో లింక్ చేసుకోవడం బెటర్. ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సా్ప్ ద్వారా కావల్సిన డాక్యుమెంట్స్ పొందొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి