దక్షిణాదిలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలో అజిత్ కుమార్ ఒకరు. కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన చివరిగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటించారు. ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రూ.230 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఈ చిత్రానికి నటుడు ప్రభు అల్లుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. అజిత్ కుమార్ తదుపరి AK64 చిత్రంలో నటించనున్నారు . ఈ చిత్రానికి దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మరోసారి దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు అజిత్ ఇప్పుడు తన దృష్టిని కార్ రేసింగ్ పై పెట్టారు. కొన్ని నెలలుగా పలు కార్ రేసింగ్ పోటీలలో పాల్గొంటున్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి
అజిత్ తన టీంతో కలిసి ఇప్పటివరకు 4 కి పైగా కార్ రేసుల్లో పాల్గొన్నారు. ఇప్పుడు బార్సిలోనాలో జరుగుతున్న కార్ రేస్ పోటీలో తన టీంతో కలిసి భారతదేశం తరపున కార్ రేస్ పోటీలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో నటుడు తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోలలో అజిత్ కూతురు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అజిత్ కూతురు అనౌష్కకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాయి. కార్ రేసింగ్ స్టేడియంలో తన తల్లి షాలిని, తండ్రి అజిత్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
ఇదిలా ఉంటే.. అజిత్ కుమారన్ 64వ చిత్రానికి దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా, రోమియో పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ AK64 చిత్రానికి సంగీత స్వరకర్త అనిరుధ్ సంగీతం సమకూర్చనున్నారు. అలాగే మార్గో సినిమా డైరెక్టర్ హనీఫ్ అదేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారట అజిత్.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..
A senior correspondent of the New Indian express shared the cute picture of our #AjithKumar’s picture at the Circuit De Barcelona.#AjithKumarRacing pic.twitter.com/vSfdxodpAb
— smart boy (@smartboy07_) September 27, 2025
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..