టాలీవుడ్లో పక్కింటి అమ్మాయిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ లయ. తెలుగులో ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 90వ దశకంలో టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ నటించి.. తన నటనతో మెప్పించింది. హీరోయిన్ కాకముందు చైల్డ్ ఆర్టిస్టుగానూ పలు చిత్రాలలో నటించిన ఈమె.. చిన్నప్పుడే ఇండస్ట్రీకి పరిచయమైంది. భద్రంకొడుకో సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ లయ. ఆ తర్వాత వేణు తొట్టెంపూడి హీరోగా వచ్చిన స్వయంవరం చిత్రం ద్వారా హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయింది.
ఈ సినిమా హిట్ కావడంతో లయకు వరుసగా అవకాశాలు వచ్చిపడ్డాయి. మెయిన్ లీడ్‌గానే కాకుండా పలు మల్టీస్టారర్ చిత్రాల్లో సెకండ్ హీరోయిన్‌గానూ నటించింది ఈ భామ. దాదాపుగా పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా అలరించిన లయ.. కెరీర్ మధ్యలోనే పెళ్లి చేసుకుంది. అలాగే అమెరికాలో సెటిల్ అయ్యి.. మొత్తంగా సినిమాలకు దూరమయ్యింది. చివరిగా బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం చిత్రంలో కనిపించిన లయ.. మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చి అమర్ అక్బర్ అంటోనీ, తమ్ముడు లాంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసింది. అలాగే బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది. కాగా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తమ వ్యక్తిగత విషయాలను, ఫ్యామిలీ ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఆమె ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అందులో లయ కూతురు శ్లోకా స్పెషల్ అట్రాక్షన్ నిలిచింది. అందంలో అమ్మను మించిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే లయ కూతురు శ్లోకా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది. మీరూ హీరోయిన్ లయ ఫ్యామిలీ ఫోటోలపై ఓ లుక్కేయండి.