Tollywood : 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీని ఊపేసింది.. సినిమాలు వదిలేసి బిజినెస్ రంగంలో.. ఎవరంటే..

Tollywood : 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీని ఊపేసింది.. సినిమాలు వదిలేసి బిజినెస్ రంగంలో.. ఎవరంటే..


90’sలో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. 16 ఏళ్లకే కథానాయికగా తెరంగేట్రం చేసిన ఆమె.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. దశాబ్దాలపాటు ఇండస్ట్రీని ఏలిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. తన భర్తతో కలిసి వ్యాపారరంగంలో అనేక పెట్టుబడులు పెడుతూ సక్సెస్ అవుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ రంభ. దక్షిణాదిలో ఒకప్పుడు ఆమె టాప్ హీరోయిన్. 1992లో 15 ఏళ్ల వయసులో “సర్గం” సినిమాతో మలయాళంలో అడుగుపెట్టిన రంభ, ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో నటించిన రంభ.. సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారింది. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కథానాయకగానే కాకుండా అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాలో స్పెషల్ సాంగ్ సైతం చేసింది. 2010లో సినిమాలు వదిలేసిన రంభ.. కెనడియన్ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్‌ను వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న రంభ.. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..

నిత్యం ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తుంది. బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో పాల్గొంటుంది. అలాగే త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చేందుకు రెడీగా ఉంది. నివేదికల ప్రకారం రంభ, తన భర్త ఆస్తులు మొత్తం రూ.2000 కోట్లకు పైగానే ఉన్నాయని టాక్. ఇంద్రకుమార్ పద్మనాభన్ కెనడాలో అనేక కంపెనీలను నడుపుతున్నాడు. అతను మొత్తం ఐదు కంపెనీలకు డైరెక్టర్. అలాగే మరికొన్ని కంపెనీలు రంభ పేరు మీద ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

Rambha News

Rambha News

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *