ఇప్పుడంతా ‘ఓజి’ మేనియా నడుస్తోంది. చిన్న పిల్లల నుండి పండు ముసలి వాళ్ళ వరకు ‘ఓజి’ పేరు తెగ కలవరిస్తున్నారు. ఇటీవల అంటే సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ఓజి’. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో విరుంబిస్తుంది ‘ఓజి’. ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి ప్రధాన కారణం ‘హంగ్రీ చీటా’ అంటూ వచ్చిన గ్లిమ్ప్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ‘నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా..శత్రువును ఎంచితే మొదలు వేట..చూపు గాని విసిరితే ఓర కంట..డెత్ కోటా కన్ఫిర్మ్ అంట..’ అంటూ ఆ గ్లిమ్ప్స్ తో పాటు వచ్చే లిరిక్స్ అభిమానులకు గూజ్ బంప్స్ తెప్పించాయి. సినిమాకి ప్రమోషన్స్ అవసరం లేనంత రేంజ్లో పబ్లిసిటీ తీసుకొచ్చాయి.
అయితే ఈ పాట వెనుక చాలా కథ ఉంది. ముఖ్యంగా ఈ పాటకు లిరిక్స్ అందించింది ఓ యువ సంగీత దర్శకుడు అని ఇండస్ట్రీకి చెందిన జనాలకి తప్ప ఆడియన్స్ కి తెలీదు అనే చెప్పాలి.అవును హంగ్రీ చీటా పాట పాడింది టాలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.ఆర్.ధృవన్. కానీ పాట క్రెడిట్స్ లో లిరిక్స్ సెక్షన్ వద్ద రఘురామ్ అని ఉంటుంది. వాస్తవానికి ఇతని పూర్తి పేరు రఘురామ్ ధృవన్ అని చాలా మందికి తెలీదు. ఓ పక్క సంగీత దర్శకుడిగా ‘మిత్రమండలి’ వంటి క్రేజీ సినిమాలకు పనిచేస్తూనే మరోపక్క లిరిసిస్ట్ గా, సింగర్ గా కూడా రాణిస్తున్నాడు.
సాయి దుర్గ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో ‘నో పెళ్లి’ ‘హే ఇది నేనేనా’ వంటి పాటలకు లిరిసిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించాడు ధృవన్. ఆ 2 పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అటు తర్వాత ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాలో ‘రాధే రాధే..’ అంటూ క్లైమాక్స్ లో వచ్చే పాటకు కూడా లిరిక్స్ అందించారు.అది కూడా ఆడియన్స్ ని మెప్పించింది. తర్వాత రామ్ పోతినేని ‘స్కంద’ సినిమాలో ‘నీ చుట్టు చుట్టు’, ‘మ్యాడ్’ లో ‘ప్రౌడ్ సే సింగిల్’, ‘లియో’ లో ‘నే రెడీ’ , ‘ఓజి’ లో హంగ్రీ చీటా, ‘గని’ లో ‘రోమియోకి జూలియెట్టు’ వంటి సాంగ్స్ అన్నీ కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
ఇవి కూడా చదవండి
ఇక సంగీత దర్శకుడిగా ‘ఉషా పరిణయం’ ‘లంబసింగి’ ‘మిత్ర మండలి’ వంటి ఎన్నో క్రేజీ సినిమాలకు సంగీతం అందించారు ధృవన్.’మైల్స్ ఆఫ్ లవ్’ లో ‘తెలియదే’ , బాపులో ‘కంగారు పడకు’ వంటి సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అవ్వడమే కాకుండా బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు ‘మిత్రమండలి’ సినిమాలో ‘జంబర్ గింబర్ లాలా’ సాంగ్ కూడా తెగ ట్రెండ్ అవుతుంది. ఇక ‘బొంబాయ్ పోతావా’, ‘డియో డియో’ ‘హంగ్రీ చీటా’ వంటి పాటలతో సింగర్ గా కూడా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ పాటలు కూడా చార్ట్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే. ‘ఓజి’ తో ధృవన్ పేరు మార్మోగుతుంది. ఈ సినిమాలో దాదాపు 8 సార్లు పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ కోసం ‘హంగ్రీ చీటా’ సాంగ్ ని వాడారు. ‘ఓ దశాబ్దకాలం పాటు సెలబ్రేట్ చేసుకునే సాంగ్ ను ఇచ్చారు’ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ‘హంగ్రీ చీటా’ లిరిసిస్ట్ అయిన ధృవన్ ని ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..