బీఎస్ఎన్ఎల్ సంస్థ 4జీ నెట్‌వర్క్‌లోకి లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్గా ఇచ్చింది. క్లౌడ్ బేస్డ్ ఫ్యూచర్ రెడీ 4జీ టెక్నాలజీని రెడీ చేసింది. అంటే ఫ్యూచర్ లో ఎటువంటి అంతరాయం లేకుండా 5జీకి అప్‌గ్రేడ్ చేసుకునే వీలుంటుంది.
కొత్త ప్లాన్స్
4జీ నెట్వర్క్ మొదలుపెట్టిన సందర్భంగా బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను అనౌన్స్ చేసింది. ఇందులో రూ.225 ప్లాన్ చాలా పాపులర్ అవుతోంది. రూ.225 కే రోజుకు 2.5జీబీ డేటా, అన్లిమిటెడ్ లోకల్ కాల్స్, రోజుకు 100 మెసేజ్ లు పొందొచ్చు. ఈ ప్యాక్ నెల రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రూ.229 ప్లాన్ తో రోజుకు 2జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, 100 మెసేజ్ లు, నెల రోజుల వ్యాలిడిటీ, అలాగే రూ.199 ప్యాక్ తో రోజుకు 2జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే ఈ లిస్ట్ లో మరికొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే..
- రూ.2399 ప్యాక్ తో రోజుకు 2జీబీ డేటా, 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
- రూ.1999 ప్యాక్ తో రోజుకు 1.5 జీబీ డేటా, 330 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
- రూ.997 ప్యాక్ తో రోజుకు 2 జీబీ డేటా, 160 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
- రూ.599 ప్యాక్ తో రోజుకు 3 జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
- రూ.347 ప్యాక్ తో రోజుకు 2 జీబీ డేటా, 50 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
- రూ.299 ప్యాక్ తో రోజుకు 3 జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
- రూ.247 ప్యాక్ తో 50 జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
- రూ.239 ప్యాక్ తో రోజుకు 2 జీబీ డేటా, 1 నెల వ్యాలిడిటీ లభిస్తుంది.
- రూ.197 ప్యాక్ తో మొత్తం 4 జీబీ డేటా, 300 నిమిషాల కాలింగ్ టైం , 54 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
- రూ.153 ప్యాక్ తో రోజుకు 1 జీబీ డేటా, 25 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
- రూ.147 ప్యాక్ తో మొత్తం 10 జీబీ డేటా, 25 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి