BCCI President Salary: బీసీసీఐ అధ్యక్షుడికి జీతమే రాదు.. కానీ, రోజుకు ఎంత తీసుకుంటాడో తెలిస్తే బుర్ర ఖరాబే..

BCCI President Salary: బీసీసీఐ అధ్యక్షుడికి జీతమే రాదు.. కానీ, రోజుకు ఎంత తీసుకుంటాడో తెలిస్తే బుర్ర ఖరాబే..


Mithun Manhas Salary: భారత దేశవాళీ క్రికెట్ దిగ్గజ బ్యాట్స్‌మెన్లలో ఒకరైన మిథున్ మన్హాస్‌ను బీసీసీఐ కొత్త చీఫ్‌గా నియమించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం నాడు మిథున్ మన్హాస్ ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా బీసీసీఐ చీఫ్‌గా గౌరవం పొందిన తొలి భారతీయ క్రికెటర్ మిథున్ మన్హాస్. ఆయనకు ముందు సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ కూడా బీసీసీఐ అధ్యక్ష పదవిని నిర్వహించారు. ఇద్దరూ భారతదేశం తరపున చాలా కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. మిథున్ మన్హాస్ అధ్యక్షుడిగా నియమితులైనప్పటికీ, ఆయనకు ఎంత జీతం అందుతుందో మీకు తెలుసా? మిథున్ మన్హాస్‌కు ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్ జీతం ఎంత?

మిథున్ మన్హాస్ బీసీసీఐ చీఫ్ అయ్యాడు. కానీ, అతనికి ఎలాంటి జీతం అందదు. ఆశ్చర్యపోకండి.. బీసీసీఐ అధ్యక్షుడి పదవి గౌరవప్రదమైనది. దీనికి జీతం ఉండదు. కానీ అతను వివిధ చెల్లింపులు అందుకుంటాడు. ఉదాహరణకు బీసీసీఐ అధ్యక్షుడు అధికారిక విధులను నిర్వర్తించడానికి రోజువారీ ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులను స్వీకరిస్తాడు. నివేదికల ప్రకారం, బీసీసీఐ అధ్యక్షుడు సంవత్సరానికి రూ. 5 కోట్ల వరకు అందుకుంటాడు.

బీసీసీఐ అధ్యక్షుడికి ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయంటే..

బీసీసీఐ అధ్యక్షుడికి జీతం లభించదు. కానీ, అతను దేశీయ సమావేశాలు, బిజినెస్ క్లాస్ ప్రయాణానికి డబ్బులు అందజేస్తారు. ఉదాహరణకు, అతను అధికారిక బోర్డు సమావేశాలకు రూ. 40,000 అందుకుంటాడు. అదనంగా, అతను భారతదేశంలో అధికారిక ప్రయాణానికి రూ. 30,000 అందుకుంటాడు. అంతర్జాతీయ ప్రయాణానికి, అతను రోజుకు రూ. 84,000 అందుకుంటాడు. అతను ఉత్తమ హోటళ్లలో ఉచిత వసతి, ఆహారం, పానీయాలతోపాటు మరెన్నో సౌకర్యాలు అందుకుంటాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *