ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను.. చరణ్ సినీ జర్నీ పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను.. చరణ్ సినీ జర్నీ పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు చరణ్. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు పెద్ది సినిమాతో ప్రేక్షకులో ముందుకు రానున్నాడు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 18ఏళ్లు అవుతుంది. సరిగ్గా ఇదే రోజు చరణ్ నటించిన చిరుత సినిమావిడుదలైంది . ఈ సినిమాకు పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. తొలి సినిమాతోనే చరణ్ ప్రేక్షకులను మెప్పించారు.

ఇది కూడా చదవండి : పెళ్ళైన 11 రోజులకే భర్త మృతి.. 7 నెలల గర్భంతో రెండో పెళ్లి.. కట్ చేస్తే అతను కూడా..

చరణ్ 18ఏళ్ళు సినీ జర్నీ పూర్తి చేసుకోవడం పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. చరణ్ కు అభినందనలు తెలుపుతూ ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. “చరణ్ బాబు, 18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను”

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : IMDbలో 7.2/10 రేటింగ్.. ఈ నలుగురు ఆడాళ్ళు మామూలోళ్లు కాదు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా..

“నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ.. విజయోస్తు…!”  అంటూ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి : అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు కుర్రాళ్లకు చమట్లు పట్టిస్తున్న భామ..! ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *