
ఆఫర్స్ లో ఎలక్ట్రానిక్స్ కొనాలనుకునేవారికి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ బెస్ట్ ఆప్షన్. ఇందులో రకరకాల గ్యా్డ్జెట్స్ పై అట్రాక్టివ్ ఆఫర్స్ లభిస్తున్నాయి. మీరు తక్కువలో బ్లూటూత్ ఇయర్ బడ్స్ కోసం చూస్తుంటే.. ఇదే మంచి అవకాశం. సేల్ లో రూ. 300 నుంచి రూ.500 లోపే కొన్ని మంచి ఇయర్ బడ్స్ లభిస్తున్నాయి.
ఆరోమా ఎన్ బీ 121
ఆరోమా ఎన్ బీ 121 పాడ్స్ అనే ఇయర్ బడ్స్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరకి లభిస్తున్నాయి. ఈ బడ్స్ ఒరిజినల్ ప్రైస్ రూ.1299 ఉండగా ఆఫర్ లో కేవలం రూ.299లకే అందుబాటులోఉంది. ఇది 5.4 బ్లూటూత్ వెర్షన్‌తో పని చేస్తుంది. బడ్స్ కేస్.. 40 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తు్ంది. ఇన్ బిల్ట్ మైక్రో ఫోన్ కూడా ఉంది. హైఫై స్టీరియో సౌండ్ సిస్టమ్ తో వస్తుంది. టచ్ కంట్రొల్స్ కూడా ఉన్నాయి. చూడ్డానికి ఇది ప్రీమియం లుక్ లో ఉంటుంది. ప్యూర్ వైట్ కలర్ లో యాపిల్ పాడ్స్ డిజైన్ తో వస్తుంది.
రాక్ టచ్ ప్రో 3
ఫ్లిప్‌కార్ట్ సేల్ లో రాక్ టచ్ టీ80 అనే మరో ఇయర్ బడ్స్ కూడా చాలా తక్కువ ధరలో రూ. 281కే లభిస్తున్నాయి. కాగా వీటి అసలు ధర రూ. రూ.799 ఉంది. ఇది 5.1 బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. బ్యాటరీ.. 30 గంటల వరకూ వస్తుంది. ఇన్ బిల్ట్ మైక్రోఫోన్ ఉంటుంది. బ్లూటూత్ రేంజ్ 10 మీటర్ల వరకూ ఉంటుంది.
టెకియో ఎయిర్ పాడ్స్
టెకియో అనే బ్రాండ్ ఇయర్ పాడ్స్ కూడా ఫ్లిప్ కార్ట్ లో రూ. 257 కే లభిస్తున్నాయి. కాగా వీటి అసలు ధర రూ.899 ఉంది. ఇది 5.2 బ్లూటూత్ కనెక్షన్‌తో వస్తుంది. ఇది 24 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఐపీ రేటింగ్ కూడా ఉంది. మాయిశ్చర్ ను తట్టుకుంటుంది. బ్లుటూత్ రేంజ్ 10 మీటర్లు ఉంటుంది. 3డీ సౌండ్ క్వాలిటీ ఫీచర్ తో వస్తుంది.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..