హైదరాబాద్, సెప్టెంబర్ 28: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువహటి నిర్వహించనున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2026)కు సంబంధించి కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవగా.. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 28 (ఆదివారం)తో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు తుది గడువు ముగిసేలోపు ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఐఐటీ గువహటి సూచించింది. ఇక రాత పరీక్షలు వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ఐఐటీ గువహటి పేర్కొంది.
గేట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ పీసెట్, పీజీసెట్, ఎడ్‌సెట్ 2025 రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఏపీ పీసెట్, పీజీసెట్, ఎడ్‌సెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌లను ఆయా కన్వీనర్లు విడుదల చేశారు. ఏపీ పీసెట్ రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇస్తుంది. ఈ నెల 30 నుంచి అక్టోబరు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన, అక్టోబర్ 5 నుంచి 7 వరకు వెబ్ ఐచ్ఛికాలు, అక్టోబర్ 8న వెబ్ ఐచ్ఛికాల మార్పులు, అక్టోబర్ 10న సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్ధులు అక్టోబరు 12 , 13 తేదీల్లో ఆయా కాలేజీల్లో చేరాలని ఏపీ పీసెట్ కన్వీనర్ పాల్‌కుమార్ తెలిపారు.
ఏపీ పీజీసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌కు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన, అక్టోబరు 1 నుంచి 5 వరకు వెబ్ ఐచ్ఛికాలు, అక్టోబర్ 6న మార్పులు, అక్టోబర్ 8న సీట్ల కేటాయింపు ఉంటుంది. అక్టోబర్ 8 నుంచి 11 వరకు సీట్లు పొందిన విద్యార్ధులు సంబంధిత కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని కన్వీనర్ రవికుమార్ తెలిపారు. ఇక ఏపీ ఎడ్‌సెట్‌కు కూడా రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు రిజిస్ట్రేషన్, సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన, అక్టోబరు 5 నుంచి 7 వరకు వెబ్ ఐచ్ఛికాలు, అక్టోబర్ 8న మార్పులు, అక్టోబర్ 10న సీట్ల కేటాయింపు ఉంటుంది. అక్టోబర్ 13 లోపు సీట్లు పొందిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని కన్వీనర్ స్వామి చెప్పారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.