తన కుటుంబం పట్ల కోపం, ద్వేషంతో ఓ వ్యక్తి కనిపించినవి అన్నీ మింగేసిన షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. హాపూర్‌లోని ఒక ఆసుపత్రిలో 40 ఏళ్ల వ్యక్తి కడుపు నుంచి 29 స్పూన్లు, 19 టూత్ బ్రష్‌లు, 2 పెన్నులు తొలగించినట్లు వైద్యులు తెలిపారు.
బులంద్‌షహర్ నివాసి అయిన ఆ వ్యక్తిని ఘజియాబాద్‌లోని డ్రగ్-ఫ్రీ సెంటర్‌లో కుటుంబ సభ్యులు చేర్చారు. కొన్ని రోజులకు అతన తీవ్రమైన కడుపు నొప్పి ఉందంటూ అక్కడి సిబ్బందికి తెలిపాడు. డాక్టర్లు వద్దకు తీసుకెళ్లి వివిధ టెస్టుల్లో భాగంగా అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు. స్కాన్‌లో ఆ వ్యక్తి కడుపులో వివిధ వస్తువులు ఉన్నట్లు తేలింది. కేసు తీవ్రతను అర్థం చేసుకున్న డాక్లర్లు వెంటనే ఆపరేషన్ చేసి.. ఆ వస్తువులు బయటకు తీశారు. అతని కడుపులో 29 స్పూన్లు, 19 టూత్ బ్రష్‌లు, 2 పెన్నులు కనిపించడంతో ఆపరేషన్ చేసిన వైద్యులే షాక్ అయ్యారు. బాధితుడ్ని గురువారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.
‘కుటుంబ సభ్యులు నన్ను డీ అడిక్షన్‌కు జాయిన్ చేసి వదిలేశారు. అక్కడ నాకు సరైన ఆహారం ఇవ్వలేదు. అందుకే కోపం వచ్చి.. చేతికి దొరికినవి అన్నీ మింగేశాను’ అని సర్జరీ చేయించుకున్న వ్యక్తి చెప్పాడు. ఈ వ్యక్తి వింత కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..