నిద్ర తక్కువైన వారి మెదడులోని కొన్ని భాగాల పనితీరు మారుతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. దీంతో భావోద్వేగాల నియంత్రణ పట్టు తప్పుతున్నట్లు తెలిసింది. రాత్రి ఎసైన్‌మెంట్‌లనీ, పార్టీలని ఆలస్యంగా తినడం జీవక్రియపై దుష్ప్రభావం చూపుతుంది. స్లీప్ సిండ్రోమ్ అనేది మొత్తం ఆరోగ్యం, జ్ఞానం, ప్రవర్తనపై హానికరమైన ప్రభావాలను చూపుతుందని అంటున్నారు. మన దగ్గర యువత నాణ్యమైన నిద్ర లేక బాధపడుతుంటే అమెరికాలో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. జనరేషన్ జడ్ లో 70% మంది ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారని, నిద్ర కూడా పోవడం లేదని తాజా సర్వే వెల్లడించింది. అయితే, ఈ సమస్యను అధిగమించేందుకు బదులు వీరు పడక గది, టీవీలకే పరిమితం అవుతున్నట్లు తెలిపింది. 69% మంది డబ్బు గురించి ఆలోచిస్తూ మెలకువతోనే ఉండిపోతున్నారని తెలిపింది. 47% మంది ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నట్లు తాజా సర్వే తెలిపింది. చాలా మంది నిద్రపోయే ముందు బ్యాంకు అకౌంట్లను చూసుకుంటున్నారట. నిద్రపట్టనప్పుడు సగానికిపైగా జెన్-జడ్… సోషల్ మీడియా చూడటం, 47% మంది టీవీలు చూడడం, మరికొంత మంది బెడ్‌రూమ్‌కే పరిమితమవుతున్నట్లు తాజా సర్వే తెలిపింది. ఇలా ఎక్కువ సేపు మంచానికే పరిమితమవడం వల్ల నిద్రకు మరింత భంగం కలుగుతుందని నిపుణులు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పదేళ్లుగా పచ్చి ఆకులే అతని ఆహారం. మరి అతడి ఆరోగ్యం పరిస్థితి ఏమిటి?
ఆ రాష్ట్రంలో మనుషుల కంటే పాములే ఎక్కువ !! ఎందుకంటే
టవర్ లేకుండానే ఇకపై ఇంటర్నెట్.. ఇస్రో నెక్స్ట్ లాంచ్ టార్గెట్ అదే
ఫోన్ కాల్స్ డిస్టర్బ్ చేస్తున్నాయా ?? సింపుల్ టిప్స్.. ఇలా చేయండి
వామ్మో! టన్ను బరువున్న గుమ్మడికాయ ఎలా పండించారంటే