పండుగ సీజన్ లో కంపెనీలు కొత్తకొత్త ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇందులో భాగంగానే డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీయం ఒక అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. అదే గోల్డ్ రివార్డ్స్ స్కీమ్. పేటీయం నుంచి డిజిటల్ పేమెంట్స్, కార్డు పేమెంట్స్.. ఇలా ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినా.. వారు గోల్డ్ కాయిన్ రివార్డ్స్ పొందేలా ఓ కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. ఇదెలా ఉంటుందంటే..
గోల్డ్ రివార్డ్స్..
పేటియం యూజర్లు.. పేటియం ద్వారా చేసే ప్రతీ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ పై డిజిటల్ గోల్డ్ కాయిన్స్ పేరిట రివార్డ్స్ పొందొచ్చు. వీటిని తర్వాత బంగారంపై పెట్టుబడిగా మార్చుకోవచ్చు. సాధారణంగా రివార్డ్స్ అనేవి క్యాష్‌బ్యాక్ లేదా కూపన్స్ రూపంలో ఉంటాయి. అయితే పేటియం దీనికి భిన్నంగా గోల్డ్ కాయిన్ రివార్డ్స్ ను తీసుకొచ్చింది. ప్రతి 100 గోల్డ్ కాయిన్స్ కు.. ఒక రూపాయి విలువైన 24 క్యారెట్ డిజిటల్ గోల్డ్ ను సొంతం చేసుకునేలా ఈ స్కీమ్ ను రూపొందించింది.
ప్రతీ ట్రాన్సాక్షన్‌పై..
పేటియం యూజర్లు పేటియం యాప్ వాడి యూపీఐ పేమెంట్ చేసినా.. ఆన్‌లైన్ షాపింగ్ పేమెంట్ కు పేటియం వాడినా.. అలాగే క్యాష్ ట్రాన్స్‌ఫర్, రీఛార్జ్, బిల్ పేమెంట్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్.. ఇలా అన్నింటిపై ట్రాన్సాక్షన్ విలువలో ఒక శాతం.. బంగారు నాణెంగా మారుతుంది. అలా 100 బంగారు నాణేల్ని సంపాదిస్తే.. అది ఒక రూపాయికి విలువైన 24 క్యారెట్ ప్యూర్ పేటీఎం డిజిటల్ గోల్డ్ కు సమానం అవుతుంది. అయితే ఇది చాలా తక్కువ మొత్తమే అయినా.. మీరు పొందే క్యాష్ బ్యాక్ మీకు నేరుగా కాకుండా పెట్టుబడిగా మారుతుంది. ఇదే ఈ స్కీమ్ లో ఉన్న ప్రత్యేకత.
సూపర్ యాప్
ఇకపోతే పేటియం అనేది ఒక సూపర్ యాప్. అంటే ఇందులో అన్న రకాల ఫైనాన్షియల్ సర్వీసులు లభిస్తాయి. నార్మల్ యూపీఐ పేమెంట్స్ నుంచి ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్స్ వరకూ.. అన్ని రకాల పనులు దీంతో చేసుకోవచ్చు. మూవీస్, ఫ్లైట్స్, హోటల్స్, బిల్ పేమెంట్స్, లోన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ లు, ఫాస్టాగ్, మెట్రో టికెట్స్.. ఇలా ఇందులో లేనిదంటూ లేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి