ప్రతియేటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఈ రాష్ట్రాన్ని గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుస్తారు. కేరళ రాష్ట్రంలో ఏకంగా 350 రకాల పాములున్నాయి. పాముల కారణంగానే చెట్లు, అడవులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పాముల సంఖ్య పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాతావరణం, అధిక వర్షపాతం, దట్టమైన అడవులు పాములకు అనువైన ఆవాసాలను అందిస్తాయి. దీనివల్ల అనేక రకాల పాములు ఇక్కడ జీవించడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే, ఇక్కడి జీవవైవిధ్యం పాములకు అవసరమైన ఆహారం, ఆవాసం, అవి దాక్కునేందుకు సరైన ప్రదేశాలు ఉన్నాయి. కేరళ స్థానికులు తరచుగా కోబ్రాలను, మండల పాములను చూస్తారు. ఈ ప్రాంతంలో పాములు, మానవులు కలిసి జీవించడం వలన తరచుగా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పాములు కనిపిస్తాయి. అయితే, ఇక్కడి ప్రజలు వాటిని చూసినప్పుడు జాగ్రత్తగా ఉంటారు. ప్రమాదవశాత్తు ఎవరైనా పాము కాటుకు గురైతే మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, అవగాహన కార్యక్రమాలు బాగా ఉండటంతో వాటిని అధిగమించడం సాధ్యమవుతుంది. చాలా మంది రైతులు, గ్రామీణులు పాముల గురించి ప్రాథమిక జ్ఞానం కలిగి ఉండటంతో, పాము కాటు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలో తెలుసుకుంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టవర్ లేకుండానే ఇకపై ఇంటర్నెట్.. ఇస్రో నెక్స్ట్ లాంచ్ టార్గెట్ అదే
ఫోన్ కాల్స్ డిస్టర్బ్ చేస్తున్నాయా ?? సింపుల్ టిప్స్.. ఇలా చేయండి
వామ్మో! టన్ను బరువున్న గుమ్మడికాయ ఎలా పండించారంటే
‘ఆట్రోవర్ట్’ లక్షణాలు మీలో ఉన్నాయా? అలాంటి వారే ఇలా ఉంటారట..!
ఫేస్ బ్యాండ్‌తో తిప్పలు తప్పవా?