అందాల చిన్నది ప్రగ్యాజైస్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ అమ్మడు తన అంద చందాలతో కుర్రకారు మనసు దోచేస్తుంది. చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చిన్నది ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ప్రగ్యాజైస్వాల్ మిర్చీలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ అంతగా హిట్ అందుకోకపోయినప్పటికీ, ఈ అమ్మడుకు మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో వరసగా అవకాశాలు అందుకుంది ఈ చిన్నది.
మిర్చీలాంటి కుర్రాడు సినిమా తర్వాత వరుణ్ తేజ సరసన కంచె సినిమాలో నటించి, ఈ మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తన అందం, నటనతో అందరి మనసు దోచేసి, తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత అనేక ఆఫర్స్ చుట్టుముట్టాయి.
దీంతో ఈ అమ్మడు ఈ మూవీ తర్వాత జయజానకి నాయక, గుంటోరోడు, నమో వెంకటేశ ఇలా చాలా సినిమాల్లో నటించింది. కానీ ప్రగ్యాజైస్వాల్ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన అఖండ సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఈ మూవీతో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఈ మూవీ తర్వాత మరోసారి బాలయ్యతో జతకట్టి, డాకు మహారాజ్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ అదుకుంది. అయితే రెండు బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన రేంజ్లో అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.