బంగ్లాదేశ్ బోర్డర్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న వ్యక్తి.. BSF సిబ్బంది తనిఖీ చేయగా..!

బంగ్లాదేశ్ బోర్డర్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న వ్యక్తి.. BSF సిబ్బంది తనిఖీ చేయగా..!


బంగ్లాదేశీయుల బంగారం అక్రమ రావాణాపై బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దులో బిఎస్‌ఎఫ్ ఒక పెద్ద స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భగ్నం చేసింది. 20 బంగారు బిస్కెట్లతో ఒక స్మగ్లర్‌ను అరెస్టు చేసింది.

బంగ్లాదేశ్ నుండి భారత్‌కు అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం బరువు 1,116.27 గ్రాములు, దీని విలువ సుమారు రూ1.29 కోట్లు ఉంటుందని అంచనా. నిఘా సమాచారం ఆధారంగా, 143వ బెటాలియన్‌కు చెందిన బోర్డర్ అవుట్‌పోస్ట్ తరాలి-1 సైనికులు గస్తీ నిర్వహిస్తున్నారు. హకీంపూర్ చెక్‌పోస్ట్ వద్ద అనుమానితుడు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో అక్రమ బంగారం బయటపడింది. స్మగ్లర్‌ను పట్టుకున్నామని బిఎస్‌ఎఫ్ సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ డిఐజి ఎన్‌కె పాండే ధృవీకరించారు.

ప్రాథమిక విచారణలో, స్మగ్లర్ సరిహద్దు అవతల నుండి బంగారాన్ని తీసుకువచ్చినట్లు అంగీకరించాడు. గత సంవత్సరం, దక్షిణ బెంగాల్ సరిహద్దు ప్రాంతం నుండి రికార్డు స్థాయిలో 150 కిలోగ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంవత్సరం, జనవరి నుండి కేవలం 35 కిలోగ్రాములు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణా కార్యకలాపాలలో ఉన్న విస్తృత నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *