START 0 అని టైప్ చేసి.. 1909కి ఎస్‌ఎంఎస్ చేయాలి. ప్రమోషనల్ కాల్స్ ఆగిపోతాయి. వెబ్‌సైట్ https://www.dndcheck.co.in లోకి వెళ్లి ‘నేషనల్ డునాట్ కాల్ రిజిస్ట్రీ’ లో ప్రమోషనల్ ఫోన్‌కాల్స్‌కు అడ్డుకట్ట వేయొచ్చు. టెలికాం ప్రొవైడర్లందరికీ.. అధికారిక యాప్ ఉంటుంది. అందులో డీఎన్డీ సెట్టింగ్‌లోకి వెళ్లి ప్రిఫరెన్స్ ఎంపిక చేసుకొని ప్రమోషనల్ కాల్స్‌ను బ్లాక్ చేయొచ్చు. డీఎన్డీ సెట్టింగ్‌ను యాక్టివేట్ చేసినా అనవసరమైన ఫోన్లు వస్తుంటే.. ఫోన్‌లోని కాల్ బ్లాకింగ్ ఫీచర్‌ను ఉపయోగించి అడ్డుకట్ట వేయొచ్చు. ట్రూ కాలర్, కాల్ బ్లాకర్ లాంటి యాప్‌లు కూడా ఉన్నాయి. అవి స్పామ్, బ్యాంక్ మార్కెటింగ్ ఫోన్‌కాల్స్‌ను గుర్తిస్తాయి. ఒకసారి కాల్ వచ్చినప్పుడు ‘మార్క్ కాల్స్ యాజ్ స్పామ్’ ఆప్షన్ ఎంచుకుంటే.. ఆ తర్వాతి నుంచి ఆయా నంబర్ల నుంచి కాల్స్ రావు. ఒకే బ్యాంకుకు చెందిన మార్కెటింగ్ సిబ్బంది నుంచి తరచూ కాల్స్ వస్తుంటే.. ఆ బ్యాంకు కస్టమర్ కేర్ సర్వీసుకు కాల్ చేసి.. లేదంటే నేరుగా బ్రాంచికి వెళ్లి అప్డేట్ యువర్ ప్రిఫరెన్సెస్‌ను మార్చాలని కోరాలి. గతంలో మీరు మార్కెటింగ్ కమ్యూనికేషన్‌కు అంగీకారం తెలిపినట్లయితే.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కచ్చితంగా చెప్పాలి. డీఎన్డీ ఆప్షన్ యాక్టివేట్ చేసినా.. కాల్స్ వస్తుంటే.. నేరుగా 1909కి ఫోన్ చేసి.. ఫిర్యాదు చేయొచ్చు. బ్యాంకు వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అయ్యి.. కమ్యూనికేషన్ ప్రిఫరెన్సెస్ లేదా ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మార్కెటింగ్, ప్రమోషనల్ ఈ మెయిల్స్, ఎస్‌ఎంఎస్, కాల్స్ ఆప్షన్ డిజేబుల్ చేయడం ద్వారా అనవసరపు ఫోన్‌కాల్స్‌ను తగ్గించుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో! టన్ను బరువున్న గుమ్మడికాయ ఎలా పండించారంటే
‘ఆట్రోవర్ట్’ లక్షణాలు మీలో ఉన్నాయా? అలాంటి వారే ఇలా ఉంటారట..!
ఫేస్ బ్యాండ్‌తో తిప్పలు తప్పవా?
వామ్మో..పొట్ట నిండా చెంచాలు..టూత్ బ్రష్‌లే..