నటి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేని భర్త.. ఆమె బ్రష్‌తోనే పళ్లు తోముకుంటోన్న నటుడు.. చివరకు ఆమె బట్టల్నే…

నటి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేని భర్త.. ఆమె బ్రష్‌తోనే పళ్లు తోముకుంటోన్న నటుడు.. చివరకు ఆమె బట్టల్నే…


ప్రముఖ బాలీవుడ్ నటి, ‘కాంటా లగా’ సాంగ్‌ ఫేమ్‌ షెఫాలీ జరివాలా మరణించి మూడు నెలలు పైనే అవుతోంది. కానీ ఈ విషాదాన్ని ఆమె భర్త, ప్రముఖ నటుడు పరాగ్ త్యాగి అసలు మర్చిపోలేకపోతున్నాడు. అనుక్షణం తన భార్యను, ఆమెతో కలిసి గడిపిన మధుర క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ కుమిలిపోతున్నాడు. తన భార్య మరణాన్ని జీర్ణించుకోలేని పరాగ్ త్యాగి ఆమె ఫొటోను తన హృదయంపై పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. తాజాగా తన భార్య పేరు, తన పేరు కలిసేలా
‘షెఫాలీ పరాగ్‌ త్యాగి’ అంటూ ఓ పాడ్‌కాస్ట్‌ చానల్‌ను ప్రారంభించాడు. అందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటున్నాడు. ఈ సందర్భంగా పరాగ్ మాట్లాడుతూ.. ‘ ఇప్పుడు నేను షెఫాలీ బ్రష్‌తోనే పళ్లు తోముకుంటున్నాను. తన దిండుపైనే నిద్రిస్తున్నాను. తన టీషర్ట్స్‌, షార్ట్స్‌ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. వాటినెప్పుడూ నాపక్కనే పెట్టుకుంటున్నాను. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో తను ఆర్డర్‌ చేసిన వస్తువులు ఇప్పటికీ డెలివరీ అవుతూనే ఉన్నాయి. ఆమె విడిచిన దుస్తుల్ని ఇంతవరకు ఉతకలేదు. అవి మరీ చిన్నగా ఉండటం వల్ల ధరించలేకపోతున్నాను. కానీ, వాటిని కప్పుకునే ప్రతిరోజు నిద్రిస్తున్నాను’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు పరాగ్.

ఇక షెఫాలీతో తాను గడిపిన చివరి క్షణాలను మరోసారి గుర్తు తెచ్చుకున్నాడు పరాగ్ త్యాగి.. ‘షెఫాలీ చివరిరోజు మా సింబా(పెట్ డాగ్)ను వాకింగ్‌కు తీసుకెళ్లమని నాకు చెప్పింది. బయటకు వెళ్లి వచ్చేలోపు అపస్మారక స్థితిలో పడి ఉంది. సీపీఆర్‌ కూడా చేశాను. రెండుసార్లు శ్వాస తీసుకుంది. కానీ ఆ వెంటనే కన్నుమూసింది’ అని చెప్పుకొచ్చాడు పరాగ్.

ఇవి కూడా చదవండి

షెఫాలీ జరివాలా గురించి భర్త పరాగ్ త్యాగి మాటల్లో..

కాగా యాంటీఏజింగ్‌ డ్రగ్స్‌, ట్యాబ్లెట్ల వల్లే షెఫాలీ మరణించిందన్న వార్తలను పరాగ్‌ కొట్టిపారేశాడు. ఆమె ఎప్పుడూ డ్రగ్స్‌ వాడలేదని, కేవలం మల్టీ విటమిన్స్‌ టాబ్లెట్స్‌ మాత్రమే తీసుకునేదని క్లారిటీ ఇచ్చాడు.

షెఫాలీ జరివాలాతో భర్త పరాగ్ త్యాగీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *