దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మది రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను జరిపిస్తారు. భక్తులందరూ నిష్టగా ఉపవాసం ఉంటూ, రోజూ ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారిని పూజించుకుంటారు. అయితే ఈ నవరాత్రి ఉత్సవాల సమయంలో ఇలాంటి కలలు వస్తే చాలా మంచిదంట.
నవారాత్రి ఉత్సవాల సమయంలో కలలో దుర్గామాతను చూడటం చాలా శుభ ప్రదం అంట. దుర్గామాత కలలోకిరావడం వలన ఆ వ్యక్తి జీవితంలోని సమస్యల నుంచి బయటపడతాడంట.అంతే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలిగిపోయి, చాలా సంతోషంగా జీవిస్తారంట.
కమలం పువ్వు అంటే చాలా అందరికీ లక్ష్మీదేవినే కనిపిస్తుంది. అయితే కమలం పువ్వు దుర్గామాతకు కూడా సంబంధం ఉంటుందంట. అందువలన కమలం కలలో కనిపించడం కూడా చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. దీని వలన ఆర్థిక ప్రయోజనం కలుగుతుందంట.
దుర్గామత నవరాత్రి ఉత్సవాల సమయంలో ఎర్రటి క్లాత్ కలలో కనిపించడం, సింహాలు కలలో కనిపించడం చాలా మంచిదంట. దీని వలన అమ్మవారి అనుగ్రహం మీ ఉన్నది అని అర్థం అంట. అందుకే ఇలాంటి కలలు వస్తే భయపడాల్సిన పనిలేదు అంటున్నారు పండితులు.
(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)