Tollywood: స్టార్ హీరో మెటీరియల్ కదా! ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ నటుడిని గుర్తు పట్టారా? తారక్‌కు చాలా ఇష్టం

Tollywood: స్టార్ హీరో మెటీరియల్ కదా! ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ నటుడిని గుర్తు పట్టారా? తారక్‌కు చాలా ఇష్టం


పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను టాలీవుడ్ లో బాగా ఫేమస్. నటుడిగా, విలన్ గా, సహాయక నటుడిగా, కమెడియన్ గా, యాంకర్ గా.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అన్నట్లు ఈ నటుడి ఫ్యామిలీలో దాదాపు అందరిదీ సినిమా నేపథ్యమే. తండ్రి ప్రముఖ నటుడు కమ్ దర్శకుడు. అంతేకాదు ఎంతో మంది స్టార్ హీరోలకు యాక్టింగ్ లో శిక్షణ ఇచ్చారు. అలా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇతను కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. వందలాది చిత్రాల్లో నటించాడు. సూపర్ హిట్ సీరియల్స్ లో యాక్ట్ చేసి బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి తర్వాతి తరం కూడా ఇండస్ట్రీలోకి రానుంది. ఈ నటుడి కుమారుడు ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే రెండో సినిమా కూడా రానుంది. వీరందరికంటే ఈ ఫ్యామిలీలో ఉన్న స్టార్ యాంకర్ బాగా ఫేమస్. పేరుకు మలయాళీనే అయినా తెలుగులో గలా గలా మాట్లాడుతుంది. నిత్యం టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజి బిజీగా ఉంటోంది. ఇక ఏదైనా సినిమా ఈవెంట్ ఉందంటే ఈ యాంకరమ్మ ఉండి తీరాల్సిందే. తన వాక్చాతుర్యంతో స్టార్ హీరోలు, హీరోయిన్లకు మించి క్రేజ్, పారితోషికం అందుకుంటోంది. పైఫొటోలో ఉన్నది ఆ స్టార్ యాంకరమ్మ భర్తనే. అతను మరెవరో కాదు ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల.

సినిమాలు, టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటోన్న రాజీవ కనకాల సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన అప్ డేట్స్ ను అందులో షేర్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక త్రో బ్యాక్ ఫొటోను షేర్ చేశాడు. అందులో రాజీవ్ తో పాటు అతని తండ్రి, నటుడు, దర్శకుడు దేవ దాస్ కనకాల, తల్లి లక్ష్మీ దేవి, సోదరి శ్రీ లక్ష్మి ఉన్నారు. ‘ మా ఆర్కైవ్‌లను బ్రౌజ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఈ ఓల్డ్ ఫ్యామిలీ ఫొటో కనిపించింది. దీనిని చూసిన తర్వాత చిన్నప్పటి అందమైన క్షణాలు, జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వచ్చాయి’ అంటూ ఈ ఫొటోకు ఒక క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

తల్లిదండ్రులతో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల షేర్ చేసిన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. టీనేజ్ లో రాజీవ్ స్టార్ హీరోలా ఉన్నాడంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన లిటిల్ హార్ట్స్ సినిమాలో రాజీవ్ కనకాల ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

లిటిల్ హార్ట్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *