టాలీవుడ్ సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లిప్సిక శుభవార్త చెప్పింది. తనకు పండంటి మహాలక్ష్మి పుట్టినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. చాలా రోజుల క్రితమే లిప్సకకు కూతురు పుట్టింది. అయితే ఈ శుభవార్తను ఇప్పుడు బయట పెట్టిందీ బ్యూటిఫుల్ సింగర్. తన కూతురుకు ఘనంగా బారసాల చేసిన లిప్సిక అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రముఖ సంగీత దర్శకులు, ఆస్కార్ విజేత కీరవాణి, వరుణ్ సందేశ్ సతీమని వితికా షేరు ఈ వేడుకలో సందడి చేశారు. లిప్సిక కూతురిని మనసారా ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, సింగర్స్, అభిమానులు, నెటిజన్లు లిప్సికకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2012లో ఉదయ్ కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది లిప్సిక. పెద్దల ఆశీర్వాదంతో వివాహం చేసుకున్న ఈ జంట ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. 2012లో వీరి వివాహం కాగా ఇన్నేళ్లకు కూతురు పుట్టడంతో ఈ జంట ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే కూతురి ఊయల వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ఇక కీరవాణి దగ్గర శిష్యరికం చేస్తోంది లిప్సిక. అందుకే తన కూతురికి ఆయన ఆశీర్వాదం కూడా ఉండాలని ప్రత్యేకంగా కీరవాణిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది.
ఇవి కూడా చదవండి
చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకుంది లిప్సిక. పలు సింగింగ్ కాంపీటీషన్స్ లో పాల్గొంది. ఆ తర్వాత సింగర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బింబిసారా, టెంపర్, ఎక్స్ప్రెస్ రాజా, ప్రేమ కథ చిత్రం, బాహుబలి తదితర సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడింది. ఒక వైపు సింగర్ గా సత్తా చాటుతూనే.. మరోవైపు స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతోంది లిప్సిక. అలా మేం వయసుకు వచ్చాం సినిమాతో తన డబ్బింగ్ కెరీర్ ను ఆరంభించిన లిప్సిక.. హెబ్బా పటేల్, మేఘ ఆకాష్ , మెహరీన్ వంటి స్టార్ హీరోయిన్లకు తన గొంతును అరువుగా ఇచ్చింది.
లిప్సిక కూతురి బారసాల వేడుకలో కీరవాణి.. వీడియో..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో లిప్సిక..
భర్తతో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.