ఇవాళ భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి పునాదిరాయి.. సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన

ఇవాళ భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి పునాదిరాయి.. సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన


ఇవాళ భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి పునాదిరాయి.. సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన

భాగ్యనగరంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు వీలుగా ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ’ (FCDA)ని ఏర్పాటు చేసింది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 30 వేల ఎకరాల్లో ఈ అధునాతన సిటీని నిర్మిస్తోంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవిన్యూ గ్రామాల పరిధిలో ఈ సిటీ విస్తరించనుంది.

మహా నగరానికి పెరుగుతున్న వలసలు, అభివృద్ధికి అనుగుణంగా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఫ్యూచర్ సిటీ కీలకంగా మారనుంది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక, సామాజిక కేంద్రంగా ఈ సిటీని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. సుస్థిర పట్టణాభివృద్ధికి ప్రపంచ నమూనాగా దీన్ని రూపొందించేందుకు అభివృద్ధి ప్రణాళికలు తయారు చేశారు. ప్రపంచ బ్యాంకు, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (JICA) వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ సిటీ అభివృద్ధిలో బాగస్వామ్యం పంచుకుంటున్నాయి.

దేశంలో మొట్టమొదటి నెట్-జీరో స్మార్ట్ సిటీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. 15 వేల ఎకరాల సిటీ ఏరియాతో పాటు దానికి అనుకొని ఉన్న దానికి ఆనుకుని ఉన్న 15 వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉండటంతో గ్రీన్ లంగ్స్​గా పని చేయనుంది. స్పాంజ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ లతో పాటు వాటర్ రీసైక్లింగ్, జీరో-డిశ్చార్జ్ ఉండేలా పర్యావరణ హిత నగరంగా ఉండే కార్యక్రమాలను ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో అమలు చేస్తుంది. ‘లైవ్, లెర్న్, వర్క్, ప్లే’ (Live, Learn, Work, Play) కాన్సెప్ట్ తో ఈ సిటీ అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలతో పాటు స్కూళ్లు, హాస్పిటళ్లు, పార్కులు, షాపింగ్ సెంటర్లు అన్నీ ఒకే ఇంటిగ్రేటెడ్ జోన్‌లో ఉంటాయి. ఫార్మాతో పాటు హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్-బేస్డ్ పరిశ్రమలు, ఎంటర్టైన్మెంట్ ఎకో టూరిజం జోన్లుగా ఈ సిటీని విభజించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *