OG Movie: ‘ఓజీ’లో పవన్ కల్యాణ్ కూతురుగా నటించింది ఎవరో తెలుసా? ఈ పాప బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా

OG Movie: ‘ఓజీ’లో పవన్ కల్యాణ్ కూతురుగా నటించింది ఎవరో తెలుసా? ఈ పాప బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా


పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా ఓజీ. డీవీవీ ఎంటర్‌ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించింది. అలాగే బాలీవుడ్ హీరో ఇమ్రాన హష్మీ స్టైలిష్ విలన్ గా అదరగొట్టాడు. శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌, సుహాస్, ప్రకాశ్‌ రాజ్‌, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్,  వెంకట్, బిగ్ బాస్ శుభశ్రీ రాయగురు ఇలా ఎందరో స్టార్స్ ఓజీలో మెరిశారు. కాగా ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ గానే కాకుండా తండ్రిగానూ ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో పవన్‌- ప్రియాంకల కూతురిగా సాయేషా అనే పాప అద్భుతంగా యాక్ట్ చేసింది. సెకెండ్ హాఫ్‌లో తండ్రి–కూతురు మధ్య వచ్చిన ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టించాయి. దీంతో పవన్ కూతురు పాత్రలో నటించిన ఆ చిన్నారి ఎవరబ్బా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ పిల్ల ఎవరు? అంతకుముందు ఏం చేసింది? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అని సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో ఓజీ పాపకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఓజీ సినిమాలో కనిపించిన చిన్నారి పేరు సాయేషా షా. ముంబైకి చెందిన పాప ఇప్పటికే పలు యాడ్స్ లోనూ నటించింది. డెటాల్, సంతూర్, లెన్స్‌కార్ట్, టాజెల్, యూరో కిడ్స్, రియల్ ఎస్టేట్ యాడ్స్ వంటి పలు ప్రముఖ బ్రాండ్స్‌ యాడ్స్ లో సాయేషా నటించింది. మృణాల్ ఠాకూర్‌ తదితర బాలీవుడ్ స్టార్స్ తోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే లాగౌట్‌ అనే హిందీ సినిమాలో చిన్న పాత్రలో యాక్ట్‌ చేసింది. అయితే ఆ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు ఓజీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమానే అయినప్పటికీ ఏ మాత్రం బెరుకు లేకుండా అద్భుతంగా నటించింది సాయేషా.

ఇవి కూడా చదవండి

ఓజీ నటీనటులతో సైయేషా షా..

ఓజీ మూవీ రిలీజ్ సందర్భంగా చిత్రయూనిట్‌తో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది సాయేషా. హీరో పవన్ కల్యాణ్, హీరోయిన్‌ ప్రియాంకతో ఆటలు ఆడుకోవడం మిస్‌ అవుతానంది. తనకు చాక్లెట్లు ఇచ్చిన అర్జున్‌దాస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది. అలాగే ప్రకాశ్‌ రాజ్‌తో పని చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ సుజిత్‌కు, అలాగే పవన్‌ సహా ఓజీ టీమ్‌కు థాంక్స్‌ చెప్పింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *