లడఖ్ అలర్లలో కుట్రకోణంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అల్లర్లకు సోనమ్ వాంగ్‌చుక్ సూత్రధారి అని పోలీసులు చెబుతున్నారు. పాకిస్తాన్‌తో ఆయనకు ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారు. వాంగ్‌చుక్‌ను జోధ్‌పూర్ జైలుకు తరలించారు.
లడఖ్ అల్లర్లపై కేంద్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. లడఖ్ అల్లర్ల కేసులో అరెస్ట్ చేసిన ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను గట్టి బందోబస్తు మధ్య రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు తరలించారు. వాంగ్‌చుక్‌పై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. అరబ్ విప్లవం, నేపాల్ జెన్-Z ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ.. లడఖ్ యువతను వాంగ్‌చుక్ రెచ్చగొట్టారని కేంద్రం ఆరోపిస్తోంది.
సోనమ్‌వాంగ్‌చుక్‌పై లడఖ్ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. కొద్ది రోజుల క్రితం లడఖ్‌లో అరెస్ట్ చేసిన పాకిస్తాన్ ఏజెంట్‌తో వాంగ్‌చుక్‌కు సంబంధాలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. దీనిపై లోతైన దర్యాప్తు చేస్తునట్టు లడఖ్ డీజీపీ ఎస్డీ సింగ్ జమ్వాల్ తెలిపారు. హింసలో నేపాల్ పౌరుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. గతంలో అరబ్ స్ప్రింగ్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి ప్రజా ఉద్యమాల గురించి సోనమ్ వాంగుచుక్ చేసిన ప్రసంగాలను కూడా డీజీపీ జమ్వాల్ ప్రస్తావించారు. వాంగుచుక్ కు రెచ్చగొట్టే చరిత్ర ఉందని ఆరోపిస్తూ.. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఉల్లంఘనలకు సంబంధించి ఆయన నిధులపైనా దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అయితే ఈ ఆరోపణలను అన్నింటినీ ఇప్పటికే సోనమ్ వాంగుచుక్ ఖండించారు. తనపై వేట జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
లడఖ్ రాజధాని లేహ్‌తోపాటు పలు జిల్లాల్లో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. లేహ్‌లో మూడు గంటల పాటు కర్ఫ్యూను సడలించారు. అయితే కర్ఫ్యూను మరికొన్ని గంటల పాటు సడలించాలని స్థానికులు కోరుతున్నారు. వలస కార్మికులు అక్కడ చిక్కుకుపోయారు. కర్ఫ్యూను మరికొన్ని గంటల పాటు సడలించాలి. నిత్యావసర వస్తువులు దొరడం లేదు. ఇక్కడ ఏమి దొరకడం లేదు. రెండు గంటు సమయం ఇవ్వాలి. మా స్వస్థలం జమ్ము.. ఉపాధి కోసం ఇక్కడికి వచ్చాం.
సుమారు 5 వేల నుంచి 6 వేల మంది నిరసనకారులు లేహ్ వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టించారని పోలీసులు పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేశారని.. బీజేపీ కార్యాలయంపై దాడి చేశారని.. వాహనాలకు నిప్పంటించారని డీజీపీ జమ్వాల్ వెల్లడించారు. ఈ ఘర్షణల్లో 17 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు సహా 70 మందికి పైగా భద్రతా సిబ్బంది, స్థానిక పౌరులు గాయపడ్డారని వివరించారు. మరో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..