Hyderabad Pink Power Run 2025: పింక్ పవర్ రన్.. క్యాన్సర్‌ గురించి అవగాహన లేకపోవడం బాధకరం: బ్రహ్మానందం

Hyderabad Pink Power Run 2025: పింక్ పవర్ రన్.. క్యాన్సర్‌ గురించి అవగాహన లేకపోవడం బాధకరం: బ్రహ్మానందం


బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో పింక్ రన్ కొనసాగుతోంది. మేఘా ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫౌండేషన్‌తో కలిసి సుధారెడ్డి ఫౌండేషన్ ఫౌండర్, చైర్‌పర్సన్ మేఘా సుధారెడ్డి నిర్వహిస్తున్నారు. పింక్ పవర్ రన్ 2.0.. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైంది. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ పింక్ రన్‌ నిర్వహిస్తున్నారు. ఈ పింక్ పవర్ రన్ 2.0.లో నటుడు బ్రహ్మానందం పాల్గొని మాట్లాడారు. క్యాన్సర్‌ గురించి అవగాహన లేకపోవడం చాలా బాధకరమన్నారు నటుడు బ్రహ్మానందం.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలన్నారు.

లైవ్ వీడియో చూడండి..



ఐదేళ్ల క్రితం లండన్ మారథాన్‌లో పాల్గొన్న అనుభూతితో హైదరాబాద్‌లోనూ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు సుధారెడ్డి. గడిచిన ఏడాది నిర్వహించిన ఫస్ట్ ఎడిషన్ విజయవంతమైంది. ఇవాళ నిర్వహిస్తున్నది పింక్ పవర్ రన్ 2.0.. ఆరోగ్యకరమైన హ్యాపీ వరల్డ్ క్రియేట్ చేయడమే ఈ రన్ ఉద్దేశమంటున్నారు సుధారెడ్డి.. పొల్యూషన్ వల్లనే కాదు స్ట్రెస్ వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందంటున్నారు. అందుకే దీనిపై అవగాహన కల్పించేందుకు రన్ నిర్వహిస్తున్నట్లు సుధారెడ్డి స్పష్టం చేశారు

బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం నిర్వహిస్తున్న ఈ పింక్ పవర్ రన్ 2.0లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *