
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే మూడో వారం ఎండింగ్ కు చేరుకుంది. మొత్తం 15 మంది హౌస్ లోకి అడుగు పెడితే ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. గత రెండు వారాల్లో శ్రష్ఠి వర్మ, మనీష్ ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వైల్డ్ కార్డ్ అంటూ మరో కామనర్ దివ్య నిఖితని హౌసులోకి తీసుకొచ్చారు. ఈమె బదులుగా ఎవరిని హౌస్ నుంచి బయటకు పంపాలని హౌస్ మేట్స్ ను అడిగాడు బిగ్ బాస్. దీనికి అందరూ సంజనా పేరు చెప్పారు. దీంతో ఆమెను శనివారం ఎపిసోడ్‌లోనే బిగ్ బాస్ స్టేజీపై తీసుకొచ్చేశారు. అయితే సంజనాను నిజంగానే ఎలిమినేట్ చేసేస్తారా? లేదా సీక్రెట్ రూంలోకి పంపిస్తారా అన్నది ఆదివారం ఎపిసోడ్ లో తేలనుంది. మరోవైపు ఈ వారం నామినేషన్లలో పవన్ కల్యాణ్, హరీశ్, ప్రియ, ఫ్లోరా సైనీ, రాము రాథోడ్, రీతూ చౌదరి ఉండగా ఉన్నారు. వీరికి ఆన్ లైన్ ఓటింగ్ కూడా జరిగింది. శుక్రవారం రాత్రిలో ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయ్యాయి.
ఆన్ లైన్ ఓటింగ్ పరంగా ప్రస్తుతం రాము రాథోడ్ టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు వారాలు త్రుటిలో ఎలిమినేషన్ తప్పించుకున్న ఫ్లోరా షైనీ ఇప్పుడు ఏకంగా రెండో స్థానంలో ఉండడం గమనార్హం. ఇక కాంట్రవర్సీ క్వీన్ రీతూ చౌదరి మూడో స్థానంలో ఉండగా మాస్క్ మ్యాన్ హరీశ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఐదు, ఆరు స్థానాల్లో పవన్ కల్యాణ్, ప్రియ ఉన్నారు. అంటే ప్రస్తుతం కల్యాణ్, ప్రియ డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. మరీ ముఖ్యంగా ప్రియ ఈ వీక్ లో బయటకు వెళ్లనుందని తెలుస్తోంది. ఈ సీజన్ ప్రారంభంలో కామనర్ కోటాలో అడుగు పెట్టిన ప్రియ ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే అనవసరంగా సెలబ్రిటీలతో గొడవకు దిగడం, యాటిట్యూడ్ చూపిస్తూ అనవరసరంగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. ఇక గతవారం సుమన్ శెట్టితో గొడవ ప్రియకు మరింత మైనస్ గా మారింది. అది ఓటింగ్ లోనూ ప్రతికూల ప్రభావం చూపించింది.
ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లనున్న ప్రియా శెట్టి
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.