Asia Cup 2025 Final : ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌తో తలపడనున్న భారత్ జట్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ, ఒకవేళ ఫైనల్‌లో విఫలమైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. అభిషేక్ వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసి, బ్యాటింగ్ చార్టులో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే, అతని నిష్క్రమణ తర్వాత భారత ఇన్నింగ్స్ నెమ్మదించడంపై షోయబ్ అక్తర్ వంటి కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. కానీ గవాస్కర్ మాత్రం జట్టులో ఉన్న ఇతర బ్యాట్స్‌మెన్ సామర్థ్యంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు.
అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్‌తో సూపర్ 4 దశలో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించి, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అభిషేక్ ఆరు మ్యాచ్‌లలో 51.50 సగటుతో, 204.63 స్ట్రైక్-రేట్‌తో 309 పరుగులు చేశాడు. అయితే, అభిషేక్ అవుటైన తర్వాత భారత ఇన్నింగ్స్ తరచుగా నెమ్మదించడంపై కొంత ఆందోళన వ్యక్తమైంది. సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ వంటి ఆటగాళ్లు దుబాయ్‌లో తమ ఫామ్ కొనసాగించడానికి కష్టపడుతున్నారని షోయబ్ అక్తర్ వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఫైనల్‌లో అభిషేక్ త్వరగా అవుటయితే భారత్‌కు కష్టమేనని అక్తర్ అన్నారు.
అయితే, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత ఇండియా టుడేతో మాట్లాడుతూ.. భారత జట్టులో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న పలువురు ఆటగాళ్లు ఉన్నారని గవాస్కర్ అన్నారు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్ల నుండి భారీ పరుగులు రావాల్సి ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. వారంతా త్వరలోనే ఫాంలోకి వచ్చి జట్టుకు కీలక పరుగులు అందిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అలాగే, ఈ టోర్నమెంట్‌లో మంచి ప్రారంభాలు పొందిన శుభ్‌మన్ గిల్ కూడా ఒక భారీ స్కోరు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని గవాస్కర్ అన్నారు. భారత బ్యాటింగ్ లైనప్‌లో ఇంకా చాలా మంది పవర్‌ఫుల్ బ్యాట్స్‌మెన్ ఉన్నారని, కాబట్టి అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
“సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా నుండి పరుగులు రావాల్సి ఉంది. శుభ్‌మన్ గిల్ బాగా బ్యాటింగ్ చేసినప్పటికీ, ఇటీవల అతని నుండి ఆశించిన భారీ స్కోర్‌లను ఇంకా అందించలేదు. ఇంకా చాలా బ్యాటింగ్ ఫైర్‌పవర్ మిగిలి ఉంది, కాబట్టి అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.” అని గావస్కర్ అన్నారు.
అంతేకాకుండా, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ అవకాశాలను చేజార్చుకోడని, పాకిస్థాన్‌తో జరిగే ఫైనల్‌లో ఒక భారీ సెంచరీని కూడా సాధించగలడని గవాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. “ముఖ్యంగా అభిషేక్ శర్మ అవకాశాలను చేజార్చుకోడు. అతను మూడు హాఫ్ సెంచరీలతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. దురదృష్టవశాత్తు రనౌట్ అవ్వడం వల్ల సెంచరీని కోల్పోయాడు, అయితే అతను మరో భారీ ఇన్నింగ్స్.. బహుశా మూడు అంకెల స్కోరు టార్గెట్ పెట్టుకునే అవకాశం ఉంది,” అని గవాస్కర్ అన్నారు. గవాస్కర్ వ్యాఖ్యలు భారత జట్టుపై, ముఖ్యంగా యువ బ్యాట్స్‌మెన్ సామర్థ్యంపై ఆయనకున్న అపారమైన విశ్వాసాన్ని స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..